గోధుమపిండి మలబార్ పరాటాలు | Wheat flour malabar paranthas Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  5th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Wheat flour malabar paranthas recipe in Telugu,గోధుమపిండి మలబార్ పరాటాలు, Pravallika Srinivas
గోధుమపిండి మలబార్ పరాటాలుby Pravallika Srinivas
  • తయారీకి సమయం

    40

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

24

0

గోధుమపిండి మలబార్ పరాటాలు వంటకం

గోధుమపిండి మలబార్ పరాటాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Wheat flour malabar paranthas Recipe in Telugu )

  • గోధుమ పిండి 250gms
  • ఉప్పు 1/2 tbsp
  • పంచదార 1 tbsp
  • నూనె - తగినంత
  • నీరు - తగినంత
  • నెయ్యి - తగినంత

గోధుమపిండి మలబార్ పరాటాలు | How to make Wheat flour malabar paranthas Recipe in Telugu

  1. గోధుమ పిండి ఒక బౌల్ లో వేసి ఉప్పు, పంచదార వేసి కలుపుకోవాలి. ఇపుడు కొంచం కొంచం నీరు పోస్తూ చపాతి పిండి లాగా కలుపుకోవాలి .పైనుండి కొంచం నూనె వేసి కలుపుకోవాలి. ఒక 20 నిముషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండి ని మర్దనచేస్కోవాలి.పిండిని సమానంగా ముక్కలుగా కట్ చేసి ఉండలు చేసుకోవాలి. పిండి ఉండ తీస్కొని పొడి పిండి జల్లుతూ వీలైనంత పల్చగా వత్తుకోవాలి.
  2. వత్తుకున్న రొట్టి పైన నెయ్యి గోధుమ పిండి వేసి మడతలు గా చేసి రోల్ సాగదీస్తూ రోల్ చేసుకోవాలి.
  3. ఆలా అన్ని సిద్ధం చేసి ఒక 15 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు చుట్టుకున్న రోల్స్ తీస్కొని రౌండ్గా వత్తుకోవాలి. ఒక పెనం పెట్టి కాలాక నూనె వేసి సన్నని మంట పై రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే రుచికరమైన గోధుమ పిండి పరాటాలు రెడీ....

నా చిట్కా:

పిండిని రెస్ట్ చేసిన ప్రతిసారి మూత పెట్టడం వలన పిండి లోని తేమ అలానే ఉండి చాలా మెత్తగా వస్తాయి.

Reviews for Wheat flour malabar paranthas Recipe in Telugu (0)