హోమ్ / వంటకాలు / దోసకాయ పచ్చడి ముక్కలు.

Photo of Dosakaya pachadi mukkalu by Chandrika Marripudi at BetterButter
129
0
0.0(0)
0

దోసకాయ పచ్చడి ముక్కలు.

Oct-05-2018
Chandrika Marripudi
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోసకాయ పచ్చడి ముక్కలు. రెసిపీ గురించి

దోసకాయ పచ్చి ముక్కలతో చేసుకునే పచ్చడి.వంకాయ,పచ్చిమిర్చి వేయించి పచ్చడి చేసి దోసముక్కలు కలుపుకోవాలి.వంకాయ బదులుగా పల్లీలు,నువ్వులు వేయించి పచ్చిమిర్చి తో పచ్చడి చేసి దోసముక్కలు కలుపుకోవచ్చు.ఎలా అయినా వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 4

  1. దోసకాయ : 1పెద్దది
  2. వంకాయలు : 1/4 కేజి
  3. పచ్చిమిర్చి : 20
  4. ధనియాలు : 1 స్పూను
  5. ఆవాలు : 1 స్పూను
  6. జీలకర్ర : 1 స్పూను
  7. మినప్పప్పు : 2 స్పూన్లు
  8. పచ్చిశనగపప్పు : 2స్పూన్లు
  9. నూనె : 4 టేబుల్ స్పూన్లు
  10. ఉప్పు : తగినంత
  11. చింతపండు : ఉసిరికాయంత
  12. వెల్లుల్లి : 10 రెబ్బలు
  13. కరివేపాకు : 4 రెమ్మలు
  14. కొత్తిమీర : కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఒక బాండీ లో వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ధనియాలు,2స్పూన్ల నూనె వేసి వేయించాలి.
  2. వేగాక చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి కలపాలి.
  3. చల్లారాక ఉప్పు వేసి మిక్సిలో వేసి పచ్చడి చేసుకోవాలి.
  4. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి వేడయ్యాక పోపుదినుసులు, కరివేపాకు వేసి వేయించి రుబ్బిన పచ్చడిని వేసి కలపాలి.
  5. ఇప్పుడు సన్నగా తరిగిన దోసకాయ ముక్కలు వేసి తరిగిన కొత్తిమీర వేసి ఒక నిమిషం కలిపి గిన్నెలోకి తీసుకోవాలి.అంతే దోసకాయ పచ్చడి ముక్కలు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర