ఆపిల్ చట్నీ | Apple chutney Recipe in Telugu

ద్వారా lakshmi kumari  |  5th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Apple chutney recipe in Telugu,ఆపిల్ చట్నీ, lakshmi kumari
ఆపిల్ చట్నీby lakshmi kumari
 • తయారీకి సమయం

  12

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

ఆపిల్ చట్నీ వంటకం

ఆపిల్ చట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Apple chutney Recipe in Telugu )

 • ఆపిల్....1
 • నూనె.....3 టేబుల్ స్పూన్లు
 • ఉప్పు.....1 టీ స్పూను
 • ఆవాలు...1టీ స్పూను
 • కజ్జురం ముక్కలు....2టీ స్పూన్లు
 • జీలకర్ర పొడి....1/2టీ స్పూను
 • లవంగ పొడి.....1/4టీ స్పూను
 • ఖారం పొడి ......1టీ స్పూను
 • దాల్చిచెక్క పొడి....1/4టీ స్పూను
 • ఆరెంజ్ జ్యూస్......1/2 కప్
 • పసుపు.....చిటికెడు
 • బెల్లం లేదా పంచదార....1టీ స్పూను
 • మిరియాల పొడి.....2చిటికెళ్లు
 • ఆపిల్ సిడార్ వినెగార్...2టీ స్పూన్లు

ఆపిల్ చట్నీ | How to make Apple chutney Recipe in Telugu

 1. ముందుగా ఆపిల్ ని తొక్కతీసి , కోరి, వినేగర్లో వేసుంచాలి.
 2. పొయ్యి మీద బాణలి పెట్టీ, అందులో , నూనె వెయ్యాలి.
 3. నూనె వేడెక్కిన తరువాత, ఆవాలు వెయ్యాలి.
 4. ఆవాలు వెగేక, జీలకర్ర పొడి, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి, లవంగాల పొడి, ఖారం, ఉప్పు వేసి కలపాలి.
 5. ఇప్పుడు కజ్జురం ముక్కలు వేసి, 2 నిముషాలు చిన్న మంట పైన వేగనివ్వాలి.
 6. ఇప్పుడు ఆపిల్ కోరు వేసి, కలపాలి.
 7. 5 నిముషాలు వేగనివ్వాలి.
 8. దగ్గిర పడ్డాక ఒక బౌల్ లోకి తీసుకోవాలి.
 9. అలుపరోట లోకి , చపాతీ లోకి బాగుంటుంది.

నా చిట్కా:

గ్రీన్ ఆపిల్ తో కూడా చేసుకోవచ్చు. ట్రేడ్ క్యాప్సికమ్ కూడా కలిపి చేసుకోవచ్చు.

Reviews for Apple chutney Recipe in Telugu (0)