కాకరకాయ పచ్చిమిర్చి పచ్చడి | Bitter gourd green chilli chutney Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  5th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bitter gourd green chilli chutney recipe in Telugu,కాకరకాయ పచ్చిమిర్చి పచ్చడి, Kavitha Perumareddy
కాకరకాయ పచ్చిమిర్చి పచ్చడిby Kavitha Perumareddy
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

0

0

కాకరకాయ పచ్చిమిర్చి పచ్చడి వంటకం

కాకరకాయ పచ్చిమిర్చి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bitter gourd green chilli chutney Recipe in Telugu )

 • కాకరకాయలు 4
 • పచ్చిమిర్చి 10
 • చింతపండు నిమ్మకాయ సైజ్
 • జీలకర్ర స్పున్
 • నూనె 2 స్పూన్స్
 • ఉప్పు తగినంత
 • వెల్లుల్లి 10 రెబ్బలు
 • కరివేపాకు కొద్దిగా
 • కొత్తిమీర గుప్పెడు
 • పోపుగింజలు స్పున్
 • ఎండుమిర్చి పోపుకు 2

కాకరకాయ పచ్చిమిర్చి పచ్చడి | How to make Bitter gourd green chilli chutney Recipe in Telugu

 1. ముందుగా కాకరకాయలు కడిగి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.పచ్చిమిర్చి కడిగి పెట్టుకోవాలి. మిగతా అన్ని వస్తువులు రెడీగా పెట్టుకోవాలి.
 2. ఇప్పుడు రోటిలో ముందుగా కాకరకాయ ముక్కలు వేసి దంచుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి.మరీ మెత్తగా దంచకూడదు పలుకులుగా ఉండాలి.
 3. తరువాత దంచుకున్న కాకరను పక్కకు తీసుకొని రోటిలో పచ్చిమిర్చి, చింతపండు, వేసి మెత్తగా దంచుకోవాలి.
 4. తరువాత జీలకర్ర, వెల్లుల్లి ఇంకొంచెం ఉప్పు వేసి దంచుకోవాలి.
 5. తరువాత కొత్తిమీర,ముందుగా దంచిన కాకరకాయ అంతా వేసి కలిగేలా దంచుకోవాలి.పచ్చడి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
 6. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి పోపుగింజలు,ఎండుమిర్చి, కరివేపాకుతో పోపు వేసి వేగినతరువత పచ్చడి వేసుకోవాలి.
 7. పచ్చడి పోపులో కలిసేలా కలిపి 5 నిముసాలు మగ్గించాలి. అంతే పచ్చడి రెడీ.

నా చిట్కా:

అప్పుడప్పుడు కాకరకాయ తింటూ ఉంటే మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. ఆరోగ్యంగా వుంటారు.

Reviews for Bitter gourd green chilli chutney Recipe in Telugu (0)