ఉగాది పచ్చడి | UGAADI pacchadi Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  5th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • UGAADI pacchadi recipe in Telugu,ఉగాది పచ్చడి, Kavitha Perumareddy
ఉగాది పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    0

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

ఉగాది పచ్చడి వంటకం

ఉగాది పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make UGAADI pacchadi Recipe in Telugu )

  • మామిడికాయ ముక్కలు చిన్న కప్ సగం
  • వేపాపువ్వు 2 స్పూన్స్
  • బెల్లం తురుము పావు కప్ చిన్నది
  • కారం సగం స్పున్
  • ఉప్పు సగం స్పున్
  • చింతపండు కొద్దిగా

ఉగాది పచ్చడి | How to make UGAADI pacchadi Recipe in Telugu

  1. ఒక గిన్నె తీసుకొని చిన్న గ్లాస్ నీళ్లు పోసుకొని బెల్లం ,చింతపండు వేసి నానబెట్టుకోవాలి. నానిన తరువాత బాగా చేతితో నలిపి నలకలు చింతపండు తొక్కలు లేకుండా వేరే గిన్నెలో వడబోసుకోవాలి. తరువాత వేపపువ్వు,మామిడికాయ ముక్కలు, కారం,ఉప్పుఅన్నీ వేసి బాగా కలుపుకోవాలి.
  2. తరువాత వేరే గిన్నెలో తీసుకొని దేవునికి నైవేద్యం పెట్టి అందరూ ప్రసాదం గా తీసుకోవాలి. :blush:

నా చిట్కా:

ఉగాది పచ్చడిలో ఈ ఆరు రుచులు కలుపుకుంటే బాగుంటుంది. ఇంకా వేరేవి ఏమి వేసినా అంత బాగుండదు .

Reviews for UGAADI pacchadi Recipe in Telugu (0)