మామిడికాయ తొక్కుడు పచ్చడి. | Mango pickle. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  5th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mango pickle. recipe in Telugu,మామిడికాయ తొక్కుడు పచ్చడి., దూసి గీత
మామిడికాయ తొక్కుడు పచ్చడి.by దూసి గీత
  • తయారీకి సమయం

    40

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

మామిడికాయ తొక్కుడు పచ్చడి. వంటకం

మామిడికాయ తొక్కుడు పచ్చడి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango pickle. Recipe in Telugu )

  • అవసరమైన పదార్థాలు :
  • 1 : మామిడికాయలు : 6.
  • 2 : ఉప్పు : 1 కప్పు.
  • 3 : ఖారం : 1 కప్పు
  • 4 : బెల్లం. : ,2 కప్పులు.
  • 5 పసుపు : 1 చెంచా.
  • 6 : నూనె : 2 కప్పులు.
  • 7 : ఆవాలు : 1 చెంచా.
  • 8 : మెంతులు : 2 చెంచాలు.
  • 9 : ఇంగువ : 1/4 చెంచా.

మామిడికాయ తొక్కుడు పచ్చడి. | How to make Mango pickle. Recipe in Telugu

  1. మామిడి కాయలు శుభ్రం చేసి ,పై తొక్క తీసి తురుముకోవాలి.
  2. మామిడి తురుము లో ఉప్పు,పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టేసి ఉంచేయాలి
  3. 2 రోజులు తర్వాత తీసి ( మధ్యలో ఒకసారి కలపాలి) తురుము, ఊట విడి విడిగా ఎండపెట్టాలి.
  4. మంచి ఎండలో ఓ 3 లేక 4 రోజులు ఎండితే చాలు.
  5. ఎండిన ఈ మామిడి తురుము కి ఆవాలు,మెంతులు, ఇంగువ తో పోపు పెట్టాలి.
  6. నూనె మరిగించి, అది గోరువెచ్చగా అయాక కారం మెంతులు వేయించి చేసిన పొడీ, వెయ్యాలి.
  7. బెల్లం కూడా పాకం పట్టి పచ్చడిలో వెయ్యాలి. ఘుమఘుమలాడే ప్రత్యేక రుచితో తీపి తురుము పచ్చడి సిద్ధం.

నా చిట్కా:

నా చిట్కా.. ఈ పచ్చడి ఎండినది జాడీలో జాగ్రత్త చేస్తే ఒకేసారి కాకుండాకొద్దిగ తీసి పోపూ, ఖారం బెల్లం కలుపుకుంటేబావుంటుంది

Reviews for Mango pickle. Recipe in Telugu (0)