టమాటా నిల్వ పచ్చడి. | Tomato pickle. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  5th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tomato pickle. recipe in Telugu,టమాటా నిల్వ పచ్చడి., దూసి గీత
టమాటా నిల్వ పచ్చడి.by దూసి గీత
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

టమాటా నిల్వ పచ్చడి. వంటకం

టమాటా నిల్వ పచ్చడి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato pickle. Recipe in Telugu )

  • కావలిసిన పదార్థములు.:
  • 1 - పుల్లని టమాటాలు : 1 కిలో.
  • 2 - ఉప్పు : 1 కప్పు‌.
  • 3 - ఖారం : 1 1/2 కప్పులు.
  • 4 - చింతపండు : పెద్ద నిమ్మకాయంత.
  • 5 - పసుపు : 1/2 చెంచా..
  • 6 - పోపుకి : శనగపప్పు : 1చెంచా..
  • 7 - ఎండుమిర్చి : 4.
  • 8 - ఆవాలు : 1 చెంచా.
  • 9 - మెంతులు : 1 1/2 చెంచా‌
  • 10 - ఇంగువ : 1/2 చెంచా.
  • 11 - కరివేపాకు : 2 రెమ్మలు.
  • 12 - నూనె :. 1/2 కిలో.

టమాటా నిల్వ పచ్చడి. | How to make Tomato pickle. Recipe in Telugu

  1. టమాటాలు నాలుగు ముక్కలు గా చేసి అందులో ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టేయాలి.
  2. 3 రోజులు తర్వాత తీసి చూస్తే బాగా ఊరి ఉంటుంది.
  3. ఆ టమాటా ముక్కలనీ, రసాన్నీ విడి విడి విడిగా ఎండలో పెట్టాలి.
  4. అలా 3 ,రోజులు ఎండిన తర్వాత చింతపండు కూడా విడదీసి పచ్చడి తో పాటూ ఎండలో ఉంచాలి కొద్దిగా ఎండిన తర్వాత రసమూ,ముక్కలూ అన్నీ కలిపి 2రోజులు ఎండనివ్వాలి.
  5. ఇప్పుడు శనగపప్పు,ఆవాలు, మెంతులూ, ఇంగువ ,కరివేపాకు, ఎండు మిర్చి తో పోపు పెట్టుకోవాలి.
  6. నూనె వేడి చేసి కాస్త చల్లగా అయిన తర్వాత అందులో ఖారం,మెంతులు వేయించి చేసిన పొడీ.. వేసెయ్యాలి. ఓ గంట సేపు పక్కన పెడితే వేసిన ఖారం అవన్నీ పచ్చడికి పట్టి పచ్చడి సిద్ధమవుతుంది.

నా చిట్కా:

ఖారం ,పోపూ,అన్నీ కూడా ఒకేసారి కాక ఎప్పటికప్పుడు వేసుకుంటే పచ్చడి తాజాగా బావుంటుంది.

Reviews for Tomato pickle. Recipe in Telugu (0)