ఎర్ర క్యాప్సికమ్ టమాటో పచ్చడి | Red bell pepper tomato chutney Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  6th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Red bell pepper tomato chutney recipe in Telugu,ఎర్ర క్యాప్సికమ్ టమాటో పచ్చడి, Lalitha Kandala
ఎర్ర క్యాప్సికమ్ టమాటో పచ్చడిby Lalitha Kandala
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

ఎర్ర క్యాప్సికమ్ టమాటో పచ్చడి వంటకం

ఎర్ర క్యాప్సికమ్ టమాటో పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Red bell pepper tomato chutney Recipe in Telugu )

  • ఒక పెద్ద ఎర్ర క్యాప్సికమ్
  • 4 టొమాటోలు
  • ఒక పెద్ద కప్ కొత్తిమీర
  • ఒక చిన్న కప్ పుదీనా
  • నిమ్మకాయ size లో చింతపండు
  • ఉప్పు రుచికి సరిపడా
  • శనగపప్పు 1 టేబుల్ స్పూన్
  • మినపప్పు 1 టేబుల్ స్పూన్
  • ఎండుమిర్చి 5
  • వెల్లుల్లి రెబ్బలు 2
  • జీలకర్ర 1 టేబుల్ స్పూన్
  • పోపు కు ఆవాలు, ఇంగువ, కరివేపాకు
  • కారం 1/2 టేబుల్ స్పూన్

ఎర్ర క్యాప్సికమ్ టమాటో పచ్చడి | How to make Red bell pepper tomato chutney Recipe in Telugu

  1. క్యాప్సికమ్ ను బాగా కడిగి ముక్కలుగా తరగాలి
  2. టొమాటోలు బాగా కడిగి ముక్కలుగా తరగాలి
  3. కొత్తిమీర, పుదీనా కూడా బాగా కడగాలి
  4. ఒక పాన్ లో 3 చెంచాల నూనె వేసి శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, జీర వేసి వేయించి పక్కకు పెట్టాలి.
  5. అదే పాన్ లో నూనె వేసి క్యాప్సికమ్, టమోటా, ఉప్పు, పసుపు, చింతపండు వేసి కలిపి మూత పెట్టాలి.
  6. 5 నిమిషాలు ఉడికిన తరువాత కారం వేసి చల్లారనివ్వాలి.
  7. పైన చెప్పెన పప్పులతో పాటు గా , వెల్లుల్లి , ఈ పచ్చడి కూడా మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.
  8. తరువాత పోపు దినుసులు ఆవాలు, ఇంగువ , కరివేపాకు వేసి పోపు పెట్టి పచ్చడి లో వేసి కలపాలి.

Reviews for Red bell pepper tomato chutney Recipe in Telugu (0)