వాము ఆకు పచ్చడి | Carom seeds leaf pickle Recipe in Telugu

ద్వారా Dimple Gullapudi  |  6th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Carom seeds leaf pickle recipe in Telugu,వాము ఆకు పచ్చడి, Dimple Gullapudi
వాము ఆకు పచ్చడిby Dimple Gullapudi
 • తయారీకి సమయం

  10

  గంటలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  8

  జనం

0

0

వాము ఆకు పచ్చడి వంటకం

వాము ఆకు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Carom seeds leaf pickle Recipe in Telugu )

 • వాము ఆకులు 1కప్పు
 • ఎండుమిర్చి. 10
 • ఆవాలు 1 చెంచా
 • జిలకర్ర 1 చెంచా
 • మినప్పప్పు 1చెంచా
 • బాదం 2
 • జీడిపప్పు 4 పలుకులు
 • వేరు శనగ గుళ్ళు 4
 • ఉప్పు తగినంత
 • చింత పండు కొద్దిగా
 • నూనె 2చెంచాలు

వాము ఆకు పచ్చడి | How to make Carom seeds leaf pickle Recipe in Telugu

 1. వాము ఆకులను శుభ్రాంగా కడిగి పక్కన పెట్టుకోవలెను
 2. చింతపండు నీళ్లల్లో నానపెట్టలి
 3. స్టవ్ పైనబాండీ పెట్టి నూనె వేసుకోవాలి . నూనె వేడెక్కిన తరువాత పైన చెప్పిన పోపు దినుసులు అన్ని వేసుకొని వేయించాలి
 4. తర్వాత వాముఆకులను వేసుకొని మగ్గించాలి .
 5. పోపు దినుసులు చల్లారిన తరువాత ఉప్పు , నానపెట్టిన చింతపండు వేసి మిక్సీ లో ఒక రౌండు తిప్పుకోవాలి
 6. తరువాత మగ్గించిన వాముఆకులను కూడా వేసి మరో రౌండ్ రానివ్వలి. అంతే ఎంతో రుచి గా వుండే, వాముఆకుల పచ్చడి రడీ .

నా చిట్కా:

వెల్లులి ఇష్టమైన వారు ఈ పచ్చడి కి వెల్లులితో తాలింపు పెట్టుకుంటే చాల బాగుంటుది !

Reviews for Carom seeds leaf pickle Recipe in Telugu (0)