హోమ్ / వంటకాలు / ఎర్ర గోంగూర పచ్చడి

Photo of Red sorrel leaves chutney by Kavitha Perumareddy at BetterButter
614
3
0.0(0)
0

ఎర్ర గోంగూర పచ్చడి

Oct-06-2018
Kavitha Perumareddy
20 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎర్ర గోంగూర పచ్చడి రెసిపీ గురించి

ఎర్ర గోంగూర కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది.కారం ,ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది. చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 6

  1. ఎర్ర గోంగూర రెండు పెద్ద కట్టలు
  2. ఎండుమిర్చి 25లేక 30
  3. జీలకర్ర 2 స్పూన్స్
  4. ధనియాలు స్పున్
  5. మెంతులు సగం స్పున్
  6. మినపప్పు 2 స్పూన్స్
  7. నూనె ఒక టీ గ్లాస్ అంత
  8. ఉప్పు తగినంత
  9. వెల్లుల్లి రెబ్బలు 20
  10. కరివేపాకు గుప్పెడు
  11. ఇంగువ పావు స్పున్
  12. పోపుగింజలు 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా గోంగూర ను శుభ్రంగా ఒలిచి ఉప్పునీటిలో వేసి కడిగి నీరంతా ఒడిసిపోయేలా చేసుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర,ధనియాలు ,మినపప్పు, మెంతులు,ఎండుమిర్చి, వేసి వేపుకోవాలి.ఇంగువ కూడా వేసుకోవాలి.వేగిన తరువాత పక్కకు తీసుకోవాలి.
  3. మళ్ళీ బాండీలో 2 స్పూన్ల నూనె వేసి గోంగూర వేసి కలిపి 5 నిముషాలు బాగా మగ్గనివ్వాలి పచ్చి వాసన పోయేవరకు మగ్గించాలి.మరీ మడిపోయేంతగా వేపకూడదు.
  4. ఇప్పుడు రొటిలో ముందుగా వేయించిన ఎండుమిర్చి పోపు ను తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి.తరువాత మగ్గించిన గోంగూర కూడా వేసి అంతా బాగా కలిసేలా నూరుకోవాలి.తరువాత ఒక ప్లేట్ లో తీసుకోవాలి.
  5. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి గ్లాస్ లో ఉన్న నూనె అంతా వేసుకొని పోపుగింజలు, ఎండుమిర్చి, కరివేపాకు,చితక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసి పోపు వేగనివ్వాలి. తరవాత పచ్చడి అందులో వేసి కలిపి 3 నిముషాలు ఉంచాలి .అంతే ఇంకా గోంగూర పచ్చడి రెడీ .వేరే గిన్నెలో తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర