దబ్బ కాయ ఆవకాయ | Citrus Lemon Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  6th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Citrus Lemon recipe in Telugu,దబ్బ కాయ ఆవకాయ, Gadige Maheswari
దబ్బ కాయ ఆవకాయby Gadige Maheswari
  • తయారీకి సమయం

    48

    గంటలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

దబ్బ కాయ ఆవకాయ వంటకం

దబ్బ కాయ ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Citrus Lemon Recipe in Telugu )

  • 1. దబ్బకాయలు - 1/4 కిలో
  • 2. కారం - చిన్న సైజ్ గ్లాస్
  • 3. ఉప్పు రుచికి తగినంత
  • 4. పసుపు - కొద్దిగా
  • 5. వెల్లుల్లి రెబ్బలు
  • 6. నూనె - తగినంత
  • 7. ఆవ పిండి - చిన్న గ్లాసు
  • 8. పోపు కోసం : ఆవాలు, ఇంగువ, కరివేపాకు, మెంతులు

దబ్బ కాయ ఆవకాయ | How to make Citrus Lemon Recipe in Telugu

  1. ముందుగా దబ్బ కాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  2. ఈ ముక్కలను ఒక పాత్రలో తీసుకుని ముక్కలకు సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఎండలో రెండు రోజులు ఆరబెట్టాలి.
  3. ముక్కలు బాగా ఆరిన తర్వాత వాటికి సరిపడా ఉప్పు పసుపు కారం ఆవపిండి నూనె వేసి బాగా కలపాలి.
  4. చివరిగా ఒక పాత్రలో కొంచెం నూనె వేసి వేడయ్యాక ఆవాలు కరివేపాకు వెల్లుల్లి ఇంగువ మెంతులు వేసి పోపును ముక్కలను బాగా పట్టెలా కలుపుకోవాలి.
  5. అంతే నండి దబ్బకాయ ఆవకాయ రెడీ!

నా చిట్కా:

ఎండలో ముక్కలు బాగా ఆరిన తరువాతనే పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది.

Reviews for Citrus Lemon Recipe in Telugu (0)