పులిహోర ఆవకాయ | Tamparing Mango Pickle . Recipe in Telugu

ద్వారా Swapna Sashikanth Tirumamidi  |  6th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Tamparing Mango Pickle . recipe in Telugu,పులిహోర ఆవకాయ, Swapna Sashikanth Tirumamidi
పులిహోర ఆవకాయby Swapna Sashikanth Tirumamidi
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

3

0

పులిహోర ఆవకాయ వంటకం

పులిహోర ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tamparing Mango Pickle . Recipe in Telugu )

 • మామికాయలు 4(క్రికెట్ బంతి సైజు వి)
 • కారం...125 గ్రా..
 • ఆవ గుండ 125 గ్రా..
 • ఉప్పు 100 గ్రా...
 • పసుపు అర చెంచా.
 • నూ పిండి 200 గ్రా...
 • నువ్వుల నూనె 500 గ్రా
 • పోపునకు.....ఆవాలు 2 చెంచాలు
 • శెనగపప్పు 4 చెంచాలు
 • మినప్పప్పు 4 చెంచాలు
 • మంచిఇంగువ పొడి అర చెంచ్చా
 • మెంతి పొడి ఒక చెంచ్చా
 • కరివేపాకు 2 గుప్పెళ్ళు
 • ఎండుమిరపకాయలు 10

పులిహోర ఆవకాయ | How to make Tamparing Mango Pickle . Recipe in Telugu

 1. ముందుగా మామిడికాయలు శుభ్రం చేసి ఒక అరగంట చల్లని నీటిలో ఉంచుకోవాలి.
 2. కరివేపాకు కూడా కడిగి ఆరబెట్టుకోవాలి.
 3. ఇప్పుడు మామిడికాయలు నీటిలోంచి తీసి బాగా తుడిచి ....10 నిమిషాలు ఎండలో పెట్టాలి...వీటితో పాటు మనం ఆవకాయ కలపడానికి ఉపయోగించే బేసెను, గరిటలు,జాడీ కూడా ఎండ లో పెట్టుకోవాలి.
 4. అవన్నీ ఎండేలోపు ...నూపప్పు ని కమ్మగా వేయించి ...పక్కన పెట్టుకోవాలి.
 5. ఇప్పుడు మామిడి కాయలు చిన్నచిన్న ముక్కలు గా తరుక్కోవాలి
 6. ఈ ముక్కలు తరిగేలోపు నూపప్పు చల్లారుతుంది కదా...ఇపుడు దాన్ని మిక్సీలో పొడికొట్టుకోవాలి.
 7. ఇప్పుడు బేసెను లో కారము, ఆవగుండ,కాస్త పసుపు , ఉప్పు,నూ పిండి వేసి బాగా కలపి సిద్ధం గా ఉంచుకోవాలి.
 8. ఇప్పుడు మామిడి ముక్కలకి కొద్దిగా నూని పట్టించి ఇందాక సిద్ధం చేసుకున్న గుండల మిశ్రమాన్ని మామిడి ముక్కల్లో వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.
 9. ఇప్పుడు పొయ్యిమీద మూకుడు పెట్టి నువ్వుల నూనె వేసి వేడిచెయ్యాలి.
 10. నూనె కాగిన తర్వాత.... ఆవాలు...వేసి వేగాక...శెనగపప్పు,మినప్పప్పు, పసుపు,ఇంగువ,మెంతి పొడి,ఎండుమిర్చి ముక్కలు,కరివేపాకు అన్ని వరుసగా ఒకటి వేగాక ఒకటి వేస్తూ కమ్మగా వేయించి పొయ్యిమీద నుంచి దించి పక్కన పెట్టి కొద్దిగా చల్లారనివ్వాలి.
 11. పోపు చల్లారాక గుండ కలిపిన మామిడి ముక్కల్లో వేయాలి.
 12. ఇప్పుడు జాగర్తగా గరిట తో ముక్కలు,గుండ, పోపు ,నూని,అన్ని కలిసేలా బాగా కలపాలి.
 13. ఇలా బాగా కలిపిన ఆవకాయని గట్టిగా నూనె పైకి చేరేలా ,లోపల ఎక్కడ కాళీ లేకుండా అదిమి అదిమి ఉంచాలి.
 14. ఇలా ఒక రోజు ఉంచాలి. నొక్కి పెట్టడం వల్ల నూని పైకి చేరి ముక్కలు ఊరుతాయి...
 15. మొదటి దశలో కొంచం గట్టిగా ఉంటుంది ...కానీ ఒకరోజు దాటిన తరువాత బాగా ఊరి చాలా బావుంటుంది.అన్నం లో కలుపుకోడానికి వీలుగా తయారవుతుంది.
 16. రెండోరోజు కూడా మళ్ళీ ఒకసారి కిందనుంచీ బాగా కలిపి...ఇప్పుడు దీన్నీ శుభ్రమయిన ఒక జాడీ లో గానీ, గాజు సీసా లోకి గాని తీసుకొని భద్రపరచుకోవాలి.
 17. అంతే అండి చక్కటి రుచికరమైన పులిహోర ఆవకాయ వడ్డనకు సిద్ధం అయినట్టే......పుల్ల పుల్లని మామిడి ముక్కలు కర కర లాడుతూ...కారం కారం గా పంటి కింద తగులుతుంటే చాలా బావుంటుంది...
 18. *ముఖ్య గమనిక....ఇక్కడ నేను చెప్పిన గుండలు అన్నీ కూడా ఊరగాయల అమ్మే కొట్టు లో విడి విడిగా కొన్నవి ఉపయోగించడమైనది.......ఇవి ఇంట్లో కూడా చేసుకోవచ్చు.నూపిండి మాత్రం ఇంట్లో చేసినది.

నా చిట్కా:

ఎక్కడ తడి తగలరాదు.... నూని సరిపోక పోతే ఇంకొంచం నువ్వులనూనె వేసుకోవచ్చు....

Reviews for Tamparing Mango Pickle . Recipe in Telugu (0)