సాధారణంగా మనం మామూలు ఆవకాయ పెట్టుకోడానికి మామిడికాయలతోనే పులిహోరావకాయ చేస్తారు...మామూలు ఆవకాయకి ముక్కలు కొట్టేటప్పుడు కొన్ని ముక్కలు టెంక రాకుండా ఉంటాయి కదా ...అలాంటి ముక్కలు అన్ని పక్కకు తీసి వాటితో ఈ పులిహోర ఆవకాయ పెట్టుకుంటారు....ఇలా చేసిన ఆవకాయ ఎక్కువకాలం నిలవ ఉంటుంది.....కానీ మనకి బజారులో నిత్యం దొరికే మామిడి గాయాలతో కూడా పెట్టుకోవచ్చు...కాకపోతే గట్టిగా ఉన్నవాటిని,ముదురు కాయలు ఎంచుకోవాలి....ఈ పులిహోర ఆవకాయ చాలా సులభంగా,ఎవరి సాయం అవసరం లేకుండా....ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు....శుభ్రంగా పెట్టుంకుంటే ....ఒకసారి పెట్టినది 4 నెలలు వరకూ అస్సలు పాడవదు....అన్నం లోకి,అట్ల లోకి,ఉండ్రాళ్ళు,దిబ్బరొట్టి,ఇంకా ఉప్పు పిండి లాంటి పహారాల్లోకి చాలా బావుంటుంది.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి