కొబ్బరి ఉల్లిపాయ పచ్చడి | Coconut onion chutney Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  6th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Coconut onion chutney recipe in Telugu,కొబ్బరి ఉల్లిపాయ పచ్చడి, Kavitha Perumareddy
కొబ్బరి ఉల్లిపాయ పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

కొబ్బరి ఉల్లిపాయ పచ్చడి వంటకం

కొబ్బరి ఉల్లిపాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Coconut onion chutney Recipe in Telugu )

  • పచ్చికొబ్బరి ఒక చిప్ప
  • ఉల్లిపాయలు చిన్నవి 8
  • కారం 2 స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • పోపుగింజలు స్పున్
  • నూనె 1 స్పున్
  • కరివేపాకు రెండు రెమ్మలు
  • వెల్లుల్లి 6 రెబ్బలు
  • ఎండుమిర్చి పోపుకు 2

కొబ్బరి ఉల్లిపాయ పచ్చడి | How to make Coconut onion chutney Recipe in Telugu

  1. ముందుగా కొబ్బరి, ఉల్లిపాయలు ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.అన్ని వస్తువులు రెడీగా పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు రోటిలో ముందుగా కొబ్బరిముక్కలు వేసి మెత్తగా దంచుకోవాలి.
  3. తరువాత ఉల్లిపాయలు వేసి దంచుకోవాలి.తరువాత ఉప్పు,కారం వేసి అంతా కలిపి బాగా దంచుకోవాలి.
  4. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నూనె వేసి పోపుగింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి పోపు వేగిన తరువాత దంచుకున్న పచ్చడి వేసి కలుపుకోవాలి.
  5. అంతే ఇంక చాలా రుచికరమైన కొబ్బరి ఉల్లిపాయ పచ్చడి రెడీ.ఇంక వేరే గిన్నెలో తీసుకోవడమే.

నా చిట్కా:

ఉల్లిపాయలు ఘాటుగా ఉంటుంది అనుకుంటే పచ్చడిని పోపులో వేసినాక కొద్దిగసేపు మగ్గించుకుంటే సరిపోతుంది.

Reviews for Coconut onion chutney Recipe in Telugu (0)