అరటికాయ పెరుగు పచ్చడి | Raw Banana chutney with curd Recipe in Telugu

ద్వారా Meena Choppalli  |  6th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Raw Banana chutney with curd recipe in Telugu,అరటికాయ పెరుగు పచ్చడి, Meena Choppalli
అరటికాయ పెరుగు పచ్చడిby Meena Choppalli
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

1

0

అరటికాయ పెరుగు పచ్చడి వంటకం

అరటికాయ పెరుగు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raw Banana chutney with curd Recipe in Telugu )

 • అరటికాయలు 2
 • నువ్వులు 2 పెద్ద చేమ్చాలు
 • పచ్చిమిరపకాయలు 8
 • కొబ్బరి ముక్క చిన్నది
 • ఆవాలు 1 స్పూన్
 • మెంతులు కొద్దిగా
 • నేయ్యి 1 పెద్ద స్పూన్
 • జీలకర్ర 1 స్పూన్
 • ఇంగువ కొద్దిగా
 • ఉప్పు రుచికి తగినంత
 • పెరుగు 2 కప్పులు
 • కరివేపాకు 2 రొబ్బలు
 • కొత్తిమీర 1కట్ట

అరటికాయ పెరుగు పచ్చడి | How to make Raw Banana chutney with curd Recipe in Telugu

 1. ముందుగా అరటికాయలను కడిగి కుక్కర్ లో ఉప్పు,పసుపు వేసుకొని రెండు కూతలు పెట్టి ఉడికించి కొవాలి.
 2. నువ్వులు,పచ్చిమిరపకాయలు.కొబ్బరి కొంచెం ఉప్పు మిక్సీ లో మెత్తగా పేస్ట్ చెయ్యాలి .
 3. ఇప్పుడు అరటికాయలని కుక్కర్ నుండి తీసి చల్లారిన తరవాత తొక్క తీసి మెత్తగా గరిటతో మెదపాలి .
 4. ముందుగా మిక్సీ చేసుకొన్నా నువ్వుల పేస్ట్ ని మెదుపుకున్న అరటికాయ మిశ్రమం లో వేసి కలిపి పెరుగు కూడా వేసి బాగా కలపాలి .
 5. బాణలి లో నెయ్యి వేసి మెంతులు , ఆవాలు జీలకర్ర, ఎర్రగా వేగాక కరివేపాకు ఎండు మిరపకాయ ముక్కలు ఇంగువ తాలింపు చేసి కొత్తిమీరతో అలంకరించాలి.

నా చిట్కా:

పెరుగు కొంచెము పుల్లగ ఉంటే చట్నీ బావుంటుంది.

Reviews for Raw Banana chutney with curd Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo