పండుమిర్చి తొక్కు టమాటా పచ్చడి | Red chilli tomato chutney Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  6th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Red chilli tomato chutney  recipe in Telugu,పండుమిర్చి తొక్కు టమాటా పచ్చడి, Kavitha Perumareddy
పండుమిర్చి తొక్కు టమాటా పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

పండుమిర్చి తొక్కు టమాటా పచ్చడి వంటకం

పండుమిర్చి తొక్కు టమాటా పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Red chilli tomato chutney Recipe in Telugu )

  • పండుమిర్చి తొక్కు ఒక చిన్న కప్
  • టమాటాలు 3
  • పచ్చిమిర్చి 4
  • ఉల్లిపాయలు 2
  • జీలకర్ర స్పున్
  • నూనె 2 స్పున్
  • పోపుగింజలు స్పున్
  • కరివేపాకు కొద్దిగా
  • వెల్లుల్లి 4 రెబ్బలు
  • ఉప్పు అవసరం లేదు పండుమిర్చి తొక్కులో ఉంటుంది.

పండుమిర్చి తొక్కు టమాటా పచ్చడి | How to make Red chilli tomato chutney Recipe in Telugu

  1. ముందుగా టమాటాలు,పచ్చిమిర్చి,కడగాలి.ఉల్లిపాయలు పొట్టుతీసి పెట్టుకోవాలి. మిగతా వస్తువులు రెడీగా పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పొయ్యిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగిన తరువాత టమాటా ముక్కలు వేసి 5 నిముషాలు మగ్గించుకోవాలి.
  3. ఇప్పుడు రొటిలోముందుగా పండుమిర్చి పచ్చడి వేసి దంచుకోవాలి. తరువాత మగ్గించిన టమాటా మిశ్రమాన్ని వేసి అంతా కలిసేలా నూరుకోవాలి.
  4. తరువాత పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి పోపుగింజలు, కరివేపాకు, వెల్లుల్లి వేసి పోపు వేగనివ్వాలి .తరువాత దంచుకున్న పచ్చడిని కలుపుకోవాలి.
  5. తరువాత వేరే గిన్నెలో తీసుకోవాలి .అంతే ఇంకా పండుమిర్చి తొక్కు టమాటా పచ్చడి రెడీ .

నా చిట్కా:

ఈ పచ్చడిలో ఉప్పు ,చింతపండు,వేయనవసరం లేదు.ఎందుకంటే పండుమిర్చి తొక్కు పచ్చడిలో ఉంటుంది.

Reviews for Red chilli tomato chutney Recipe in Telugu (0)