హోమ్ / వంటకాలు / పండుమిర్చి తొక్కు టమాటా పచ్చడి

Photo of Red chilli tomato chutney  by Kavitha Perumareddy at BetterButter
602
0
0.0(0)
0

పండుమిర్చి తొక్కు టమాటా పచ్చడి

Oct-06-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పండుమిర్చి తొక్కు టమాటా పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చడి నిలువ పండుమిర్చి తొక్కు లో టమాటాలు వేసి చేస్తాము.చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పండుమిర్చి తొక్కు ఒక చిన్న కప్
  2. టమాటాలు 3
  3. పచ్చిమిర్చి 4
  4. ఉల్లిపాయలు 2
  5. జీలకర్ర స్పున్
  6. నూనె 2 స్పున్
  7. పోపుగింజలు స్పున్
  8. కరివేపాకు కొద్దిగా
  9. వెల్లుల్లి 4 రెబ్బలు
  10. ఉప్పు అవసరం లేదు పండుమిర్చి తొక్కులో ఉంటుంది.

సూచనలు

  1. ముందుగా టమాటాలు,పచ్చిమిర్చి,కడగాలి.ఉల్లిపాయలు పొట్టుతీసి పెట్టుకోవాలి. మిగతా వస్తువులు రెడీగా పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పొయ్యిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగిన తరువాత టమాటా ముక్కలు వేసి 5 నిముషాలు మగ్గించుకోవాలి.
  3. ఇప్పుడు రొటిలోముందుగా పండుమిర్చి పచ్చడి వేసి దంచుకోవాలి. తరువాత మగ్గించిన టమాటా మిశ్రమాన్ని వేసి అంతా కలిసేలా నూరుకోవాలి.
  4. తరువాత పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి పోపుగింజలు, కరివేపాకు, వెల్లుల్లి వేసి పోపు వేగనివ్వాలి .తరువాత దంచుకున్న పచ్చడిని కలుపుకోవాలి.
  5. తరువాత వేరే గిన్నెలో తీసుకోవాలి .అంతే ఇంకా పండుమిర్చి తొక్కు టమాటా పచ్చడి రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర