ఉసిరావకాయ. | Amla pickle. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  6th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Amla pickle. recipe in Telugu,ఉసిరావకాయ., దూసి గీత
ఉసిరావకాయ.by దూసి గీత
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

0

0

ఉసిరావకాయ. వంటకం

ఉసిరావకాయ. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Amla pickle. Recipe in Telugu )

 • అవసరమైన పదార్థాలు :
 • 1 - ఉసిరి కాయలు : 1/4 కిలో.
 • 2 - ఉప్పు : 1/4 కప్పు.
 • 3 - ఖారం : 1/2 కప్పు.
 • 4 - ఆవపిండి : 1/2 కప్పు.
 • 5 - మెంతిపొడి : 2 చెంచాలు.
 • 6 - నూనె : 1/4 కిలో.
 • 7 - పసుపు : చిటికెడు.
 • 8 - ఆవాలు : 1/2 చెంచా.
 • 9 - ఇంగువ : 1/4. చెంచా.

ఉసిరావకాయ. | How to make Amla pickle. Recipe in Telugu

 1. ఉసిరి కాయల్ని శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి.
 2. ఉప్పు,కారం, ఆవపిండి, మెంతి పొడి( మెంతులు వేయించి చేసిన పొడి) సిద్ధం చెయ్యాలి.
 3. ఉసిరి కాయల కి ఫోర్క్ తో అక్కడక్కడా గాట్లు పెట్టి, నూనెలో 5 నిమిషాలు వేయించాలి.
 4. ఒక పెద్ద డిష్ లో ఆవపిండీ,ఉప్పూ,కారం , మెంతిపిండీ, అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత ఉసిరికాయలు ,నూనె కూడా వేసి అంతా కలిసేలా పూర్తిగా కలిపి మూత పెట్టి ఉంచుకోవాలి .
 5. మరునాడు తీసి కలపాలి. 3 వ రోజుకు ఆవకాయ బాగా ఊరి సిద్ధమవుతుంది.
 6. అప్పుడు అందులో ఆవాలూ,ఇంగువ తో పోపు పెట్టాలి.
 7. ఎంతో రుచిగా ఉండే ఉసిరి ఆవకాయ తయారు.దానిని ఒక జాడీలో పెడితే సరి‌

నా చిట్కా:

ఉసిరావకాయ తీసేటపుడు పైన లేయర్ అలా ఉంచేసి కిందనుండీ తీసుకున్నాక పైపొర మళ్ళీ సర్దెస్తే నల్లగా అవదు.

Reviews for Amla pickle. Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo