నక్కదోసకాయ ఆవకాయ | Lemon or yellow cucumber Recipe in Telugu

ద్వారా Shobha.. Vrudhulla  |  6th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Lemon or yellow cucumber recipe in Telugu,నక్కదోసకాయ ఆవకాయ, Shobha.. Vrudhulla
నక్కదోసకాయ ఆవకాయby Shobha.. Vrudhulla
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

1

0

నక్కదోసకాయ ఆవకాయ వంటకం

నక్కదోసకాయ ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Lemon or yellow cucumber Recipe in Telugu )

 • నక్కదో సకాయ ఒకటి చిన్నది
 • ఉప్పు తగినంత
 • పసుపు 3 చంచాలు
 • కారము 3 కప్పులు
 • ఆవాలు పొడి 2 కప్పులు
 • ఇంగువ 1 చెంచా
 • మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకోవాలి 1 చెంచా
 • నూనె 1/4 కిలో

నక్కదోసకాయ ఆవకాయ | How to make Lemon or yellow cucumber Recipe in Telugu

 1. నక్కదోసకాయకి సగం తరిగి మధ్యకి ఒక ముక్క మాత్రమే తీసుకోండి
 2. తీసుకున్న సగం చక్కగా ముక్కలుగా చేసుకోవాలి చతురస్రాకారములో సనగపలుకు సైజ్ లో చేసి పక్కన పెట్టండి
 3. ఇప్పుడు ఒక పళ్ళెములో ఈ ముక్కలన్నీ తీసుకోవాలి
 4. ఆవపొడి,ఉప్పు, కారము, పసుపు, ఇంగువ, మెంతులు లేక వేయించిన మెంతి పొడి ఇవన్నీ పెద్ద పళ్ళెంలో వేసి బాగా కలుపుకోవాలి
 5. ఇప్పుడు యి కలిపిన పొడిలో తరిగిన దోసకాయ ముక్కల్ని వేసి మళ్ళీ బాగా కలియబెట్టాలి.
 6. ఇవన్నీ బాగా కలిసాక ఇందులో ఆవ నూనె వేసి మళ్ళీ మరో సారి వేసి కలియపెట్టాలి.
 7. ఇది ఒక గంట పాటు ఉంచాక ఏదైనా జార్ లో పెట్టి ఫ్రీజ్ లో పెడితే 2 నెలల వరకు వాడుకోవచ్చును
 8. వెంటనే అన్నంలో తినవచ్చును కూడా
 9. రొటిలో కానీ ఇడ్లి లో కానీ దేనితో అయిన తింటే చాలా బాగుంటుంది
 10. యి నక్కదో సకాయ తొక్క తీయకుండానే చేసుకోవాలి.
 11. తొక్క తిస్తె వేగంగా మెత్తపడి రుచి ఉండదు
 12. కర కర లాడుతూ ముక్క రుచిగా ఉంటుంది అన్నాముతో కలుపుకుంటే
 13. ఈ దోస కాయకు నీరు ఎక్కువ కాబట్టి బయట ఉంటే నీరు కారుతుంది దాని వల్ల ఆవకాయ రుచి ఉండదు యింకా వేగం పడయిపోతుంది కూడా అందుకే ఫ్రీజ్ లో పెడితే నీరు లేకుండా బాగుంటుంది...
 14. అంతే అప్పటికప్పుడు అరా గంటలో ఆవకాయ రెడి తినటానికి కమ్మగా ఘుమఘుమలాడుతూ నక్కదో సకాయ ఆవకాయ తయారు.

నా చిట్కా:

ఈ ఆవకాయ ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం చేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది కర కర లాడుతూ బాగుంటుంది.

Reviews for Lemon or yellow cucumber Recipe in Telugu (0)