హోమ్ / వంటకాలు / నక్కదోసకాయ ఆవకాయ

Photo of Lemon or  yellow  cucumber by Shobha.. Vrudhulla at BetterButter
1028
0
0.0(0)
0

నక్కదోసకాయ ఆవకాయ

Oct-06-2018
Shobha.. Vrudhulla
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నక్కదోసకాయ ఆవకాయ రెసిపీ గురించి

యి దోస కాయని పప్పులో వాడుతారు,పచ్చడి చేస్తారు. ఇంకా ఇలా ఆవకాయ కూడా పెట్టుకుంటారు.ఆవకాయ 2నెలలు వరకు ఉంటుంది .చాలా రుచిగా ఉంటుంది.ఆవకాయ పెట్టటం కూడా చాలా తెలికయినది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. నక్కదో సకాయ ఒకటి చిన్నది
  2. ఉప్పు తగినంత
  3. పసుపు 3 చంచాలు
  4. కారము 3 కప్పులు
  5. ఆవాలు పొడి 2 కప్పులు
  6. ఇంగువ 1 చెంచా
  7. మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకోవాలి 1 చెంచా
  8. నూనె 1/4 కిలో

సూచనలు

  1. నక్కదోసకాయకి సగం తరిగి మధ్యకి ఒక ముక్క మాత్రమే తీసుకోండి
  2. తీసుకున్న సగం చక్కగా ముక్కలుగా చేసుకోవాలి చతురస్రాకారములో సనగపలుకు సైజ్ లో చేసి పక్కన పెట్టండి
  3. ఇప్పుడు ఒక పళ్ళెములో ఈ ముక్కలన్నీ తీసుకోవాలి
  4. ఆవపొడి,ఉప్పు, కారము, పసుపు, ఇంగువ, మెంతులు లేక వేయించిన మెంతి పొడి ఇవన్నీ పెద్ద పళ్ళెంలో వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు యి కలిపిన పొడిలో తరిగిన దోసకాయ ముక్కల్ని వేసి మళ్ళీ బాగా కలియబెట్టాలి.
  6. ఇవన్నీ బాగా కలిసాక ఇందులో ఆవ నూనె వేసి మళ్ళీ మరో సారి వేసి కలియపెట్టాలి.
  7. ఇది ఒక గంట పాటు ఉంచాక ఏదైనా జార్ లో పెట్టి ఫ్రీజ్ లో పెడితే 2 నెలల వరకు వాడుకోవచ్చును
  8. వెంటనే అన్నంలో తినవచ్చును కూడా
  9. రొటిలో కానీ ఇడ్లి లో కానీ దేనితో అయిన తింటే చాలా బాగుంటుంది
  10. యి నక్కదో సకాయ తొక్క తీయకుండానే చేసుకోవాలి.
  11. తొక్క తిస్తె వేగంగా మెత్తపడి రుచి ఉండదు
  12. కర కర లాడుతూ ముక్క రుచిగా ఉంటుంది అన్నాముతో కలుపుకుంటే
  13. ఈ దోస కాయకు నీరు ఎక్కువ కాబట్టి బయట ఉంటే నీరు కారుతుంది దాని వల్ల ఆవకాయ రుచి ఉండదు యింకా వేగం పడయిపోతుంది కూడా అందుకే ఫ్రీజ్ లో పెడితే నీరు లేకుండా బాగుంటుంది...
  14. అంతే అప్పటికప్పుడు అరా గంటలో ఆవకాయ రెడి తినటానికి కమ్మగా ఘుమఘుమలాడుతూ నక్కదో సకాయ ఆవకాయ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర