పండుమిరప పచ్చడి | Red chilli pickle Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  6th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Red chilli pickle by Kavitha Perumareddy at BetterButter
పండుమిరప పచ్చడిby Kavitha Perumareddy
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

14

0

పండుమిరప పచ్చడి

పండుమిరప పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Red chilli pickle Recipe in Telugu )

 • పండుమిరప కాయలు పావుకేజీ
 • చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్
 • ఉప్పు తగినంత
 • నూనె 2 పెద్ద స్పూన్స్
 • పోపుగింజలు 2 స్పూన్స్
 • కరివేపాకు గుప్పెడు
 • వెల్లుల్లి 15 రెబ్బలు

పండుమిరప పచ్చడి | How to make Red chilli pickle Recipe in Telugu

 1. ముందుగా పండుమిర్చి కడిగి ఒక టవల్ మీద వేసి బాగా ఆరనివ్వాలి. తరువాత తొడిమలు తీసుకోవాలి.తొడిమెలు ముందే తీసి కడిగితే నీళ్లు లోపలికి పోయి ఇంకా పచ్చడికి పనికి రావు.పచ్చడి నిలువ ఉండదు.
 2. ఇప్పుడు రోటిలో పండుమిర్చి తగినంత ఉప్పు వేసి బాగా దంచుకోవాలి. కొన్ని కొన్ని వేసుకుంటూ దంచుకోవాలి. అన్నీ వేసి దంచితే మెదగవు. పండుమిర్చి దంచిన తరువాత చింతపండు వేసి అంతా కలిపి బాగా దంచుకోవాలి.
 3. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి పోపుగింజలు, కరివేపాకు, చితక్కొట్టిన వెల్లుల్లిని వేసి పోపు వేగనిచ్చి అందులో దంచిన పచ్చడి వేసి కలిపి కాసేపు మగ్గనివ్వాలి. అంతే పచ్చడి రెడీ. చల్లారిన తరువాత ఒక జాడీలో భద్రపరుచుకోవాలి. 15 రోజులు ఐనా నిలువ ఉంటుంది.

నా చిట్కా:

పండుమిరప ఘాటును బట్టి చింతపండు వేసుకోవాలి.పండుమిరప తుంచి తే ఘాటు ఎక్కువ ఉంటే చింతపండు ఎక్కువ పడుతుంది.లేకుంటే తక్కువ.

Reviews for Red chilli pickle Recipe in Telugu (0)