చింతపండు పచ్చడి | Tamarind chutny Recipe in Telugu

ద్వారా Swapna Sashikanth Tirumamidi  |  6th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Tamarind chutny recipe in Telugu,చింతపండు పచ్చడి, Swapna Sashikanth Tirumamidi
చింతపండు పచ్చడిby Swapna Sashikanth Tirumamidi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

1

0

చింతపండు పచ్చడి వంటకం

చింతపండు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tamarind chutny Recipe in Telugu )

 • చింతపండు 200 గ్రా
 • బెల్లం 100 గ్రా( మీ రుచిని బట్టి వేసుకోవచ్చు)
 • పచ్చి మిర్చి 6
 • పసుపు చిటికెడు
 • ఉప్పు ఒక చెంచా
 • ధనియాలు ఒకటిన్నర చెంచాలు
 • మెంతులు పావు చెంచా
 • ఆవాలు అర చెంచా
 • మినప్పప్పు ఒక చెంచా
 • శెనగపప్పు ఒక చెంచా
 • జీలకర్ర పావు చెంచా
 • ఆవాలు అర చెంచా
 • ఇంగువ పావు స్పూన్
 • ఎండుమిర్చి 12.
 • కరివేపాకు కొద్దిగా
 • నూనె 5..6 చెంచాలు.

చింతపండు పచ్చడి | How to make Tamarind chutny Recipe in Telugu

 1. ముందుగా చింత పండు ఈనెలు లేకుండా బాగుచేసి పెట్టుకోవాలి.
 2. ఇప్పుడు చింతపండు ఒకసారి బాగా కడిగి ఆ నీరు పారేసి వేరే గిన్నీలో ఒక కప్పు మంచి నీరు పోసి నాన పెట్టాలి.
 3. అందులోనే బెల్లము,ఉప్పు,పసుపు కూడా కొద్దిగా వేసి నాన పెట్టుకోవాలి.
 4. ఇప్పుడు ఆఖరున పోపు వేయడానికి కాస్త మినప్పప్పు, కాస్త జీలకర్ర, కాస్త ఆవాలు, 3 ఎండుమిర్చి,మొత్తం శెనగపప్పు, కరివేపాకు విడిగా ఉంచుకోవాలి.
 5. ఇప్పుడు మూకుడుపెట్టి 2 చెంచాల నూని వేసి వేడిచెయ్యాలి.
 6. ఇప్పుడు మిగిలిన ఆవాలు,మెంతులు ,మినపప్పు ,జీలకర్ర, ధనియాలు,ఎండుమిర్చి,ఇంగువ, ఒక్కొక్కటిగా వేసి వేయించాలి.
 7. పోపు కమ్మగా వేగిన తరువాత దించి ,పచ్చి మిర్చి కూడా వేసి దించి....పోపు చల్లారనిచ్చి రొటిలో గానీ, మిక్సీలో గాని పొడి చేసుకోవాలి.పొడి బరకగా వున్నా బానే ఉంటుంది.
 8. ఇప్పుడు నానిన చింతపండు,బెల్లం అన్ని ఆ మిక్సీ లో వేసి చింతపండు పోపు అన్ని బాగా కలిసే విధంగా మిక్సీ పట్టుకోవాలి.
 9. ఇప్పుడు మూకుడులో 2 చెంచాల నూనె వేసి వేడి అయ్యాక ఇందాక విడిగా ఉంచుకున్న పోపు దినుసులు ఒక్కొక్కటిగా వేసి వేయించి,ఎండుమిర్చి ముక్కలు..కరివేపాకు వేసి వేయించి పోపుని విడిగా పెట్టుకోవాలి.
 10. ఇప్పుడు అదే మూకుడులో మళ్ళీ నూనెవేసి మిక్సీ పట్టిన చింతపండు మిశ్రమాన్ని 5 నిమిషాలు ఉడకనివ్వాలి.
 11. ఇలా ఉడక నివ్వడం వల్ల నీరు ఆవిరయ్యి పచ్చడి పాడవదు...ఇప్పుడు ఉడికిన పచ్చడి మీద... వేయించి పెట్టుకున్న పోపు వేసి కలుపుకోవాలి.
 12. అంతే చక్కటి చింతపండు పచ్చడి సిద్ధం ...వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ చింత పండు పచ్చడి కలిపి తిని చూడండి ..ఇక ఆ రుచిని ఎన్నటికీ మరువలేరు సుమీ!... :yum: :yum: :yum: :yum:...ఒక్క అన్నమేమిటి....ఇడ్లిలు,దోసెలు,వడలు,బోండాలు, బజ్జిలు,.....ఇలా చాలా రకాల టిఫిన్ల లోకి ఈ చింతపండు పచ్చడి ఆమోఘంగా ఉంటుంది.

నా చిట్కా:

అల్లం ముక్కలు వేయించి...ఈ చింతపండు పచ్చడిని కావలసినంత వేసి మిక్సీ పడితే అల్లం పచ్చడి కూడా రెడీ...ఇలా చాలా చేయచ్చు.

Reviews for Tamarind chutny Recipe in Telugu (0)