హోమ్ / వంటకాలు / జీడిపప్పు ఆవకాయ

Photo of Cashewnut Pickle by Pravallika Srinivas at BetterButter
339
0
0.0(0)
0

జీడిపప్పు ఆవకాయ

Oct-07-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జీడిపప్పు ఆవకాయ రెసిపీ గురించి

శరీరానికి కావాలసిన అన్ని రకాల విటమిన్'లు జీడిపప్పులో ఉంటాయి.జీడిపప్పులో ఎక్కువ శాతం మెగ్నీషియం ఉండటం వలన అధిక రక్త పీడనాన్ని తగ్గిస్తాయి.ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన కాల్షియం మెగ్నీషియం వంటి మూలకాలు జీడి పప్పులో పుష్కలంగా ఉన్నాయి. వీటిని తినటం వలన ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. జీడిపప్పు- 100gms
  2. కారం - 3 tbsp
  3. ఉప్పు - 2 tbsp
  4. ఆవపిండి - 1 tbsp
  5. మెంతిపిండి - 1/4 tbsp
  6. వెల్లులి కారం - 1 tbsp
  7. నిమ్మరసం - 3 కాయలు
  8. నూనె - 4 tbsp
  9. జీలకర్ర - 1/2 tbsp
  10. ఆవాలు - 1/2 tbsp
  11. ఇంగువ - 1/4 spn
  12. కర్వేపాకు - 1 రెమ్మ
  13. యండుమిర్చి - 2

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నిలో ఉప్పు, కారం, ఆవపిండి ,మెంతిపిండి, వెల్లులి కారం వేసి అన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం లో నిమ్మరసం వేసి కలుపుకోవాలి.
  2. ఒక కడాయి పెట్టి నూనె వేసి కాగాక జీడిపప్పు ని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  3. అదే నూనె లో జీలకర్ర ,ఆవాలు, ఇంగువ, కర్వేపాకు, యండుమిర్చి వేసి చిటపటలాడాక జీడిపప్పు ని కారం మిశ్రమంలో కలిపి పోపు కూడా వేసి కలుపుకోవాలి. అంతే రుచికరమైన జీడిపప్పు ఆవకాయ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర