టమాటో నిలవ పచ్చడి | Tomato pickle Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  7th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tomato pickle  recipe in Telugu,టమాటో నిలవ పచ్చడి, Pravallika Srinivas
టమాటో నిలవ పచ్చడిby Pravallika Srinivas
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    60

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

టమాటో నిలవ పచ్చడి వంటకం

టమాటో నిలవ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato pickle Recipe in Telugu )

  • నాటు రకం టమాటాలు 1 kg
  • చింతపండు - 150gms
  • కారం - 200gms
  • గండుప్పు - 200gms
  • మెంతులు - 25gms
  • నూనె - తగినంత
  • పోపు దినుసులు - 1 tbsp
  • వెల్లులి రెబ్బలు - 6
  • కర్వేపాకు - 1 రెబ్బ
  • ఇంగువ - 1 pinch
  • యండుమిరపకాయలు - 2

టమాటో నిలవ పచ్చడి | How to make Tomato pickle Recipe in Telugu

  1. ముందుగా నాటు రకం టమాటాలు తీసుకొని కడిగి తడి లేకుండా పొడిబట్టతో తుడుచుకొని ఆరనివ్వాలి . ఇప్పుడు టొమాటోలు అన్నింటినీ మధ్యకు కట్ చేసుకోవాలి.
  2. ఒక డబ్బాలో టొమాటోలు లోని రసం పిండి మిగిలిన ముక్కలను వేరే ఒక ప్లేట్ లో వేసుకోవాలి. అన్నినింటిని అలాగే చేసిపెట్టుకోవాలి. ఇప్పుడు పిండిన టమాటో రసం లో చింతపండు ని నానపెట్టుకోవాలి. మిగిలిన టమాటో ముక్కలను రెండు రోజులు ఎండబెట్టుకోవాలి .
  3. మూడవ రోజున మెంతులు వేయించి పక్కన పెట్టి చల్లారిన తర్వాత పొడి కొట్టుకోవాలి.
  4. పొడి గ్రైండర్ లో ఎండిన టమాటో ముక్కలు ,చింతపండు ,గుండుప్పు ,కారం, మెంతిపిండి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి . తయారైన పచ్చడి ని పొడి జాడి లో భద్రపరుచుకోవాలి .
  5. ఎప్పుడు కావాలి అంటే అపుడు ఒక గిన్నిలో తీస్కొని కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు, వెల్లులి రెబ్బలు, కర్వేపాకు ,ఇంగువ,ఎం డుమిరపకాలు వేసి పచ్చడి లో కలుపుకోవాలి.అంతే రుచికరమైన సంవత్సరం మొత్తం నిల్వవుండే టమాటో పచ్చడి సిద్ధం .

నా చిట్కా:

టొమాటోలు హైబ్రిడ్ అయితే పులుపు ఉండవు పైగా ఎక్కువ కలం నిలువ ఉన్న రుచిమారుతుంది. అందువలన నాటు టొమాటోలు వాడాలి.

Reviews for Tomato pickle Recipe in Telugu (0)