హోమ్ / వంటకాలు / టమాటో నిలవ పచ్చడి

Photo of Tomato pickle  by Pravallika Srinivas at BetterButter
628
0
0.0(0)
0

టమాటో నిలవ పచ్చడి

Oct-07-2018
Pravallika Srinivas
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటో నిలవ పచ్చడి రెసిపీ గురించి

టమాటో నిలవ పచ్చడి పుల్లగా , కారం గా ఉంటుంది. అందరికి ఎంతో నచ్చే పచ్చడి .

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • వేగన్

కావలసినవి సర్వింగ: 10

  1. నాటు రకం టమాటాలు 1 kg
  2. చింతపండు - 150gms
  3. కారం - 200gms
  4. గండుప్పు - 200gms
  5. మెంతులు - 25gms
  6. నూనె - తగినంత
  7. పోపు దినుసులు - 1 tbsp
  8. వెల్లులి రెబ్బలు - 6
  9. కర్వేపాకు - 1 రెబ్బ
  10. ఇంగువ - 1 pinch
  11. యండుమిరపకాయలు - 2

సూచనలు

  1. ముందుగా నాటు రకం టమాటాలు తీసుకొని కడిగి తడి లేకుండా పొడిబట్టతో తుడుచుకొని ఆరనివ్వాలి . ఇప్పుడు టొమాటోలు అన్నింటినీ మధ్యకు కట్ చేసుకోవాలి.
  2. ఒక డబ్బాలో టొమాటోలు లోని రసం పిండి మిగిలిన ముక్కలను వేరే ఒక ప్లేట్ లో వేసుకోవాలి. అన్నినింటిని అలాగే చేసిపెట్టుకోవాలి. ఇప్పుడు పిండిన టమాటో రసం లో చింతపండు ని నానపెట్టుకోవాలి. మిగిలిన టమాటో ముక్కలను రెండు రోజులు ఎండబెట్టుకోవాలి .
  3. మూడవ రోజున మెంతులు వేయించి పక్కన పెట్టి చల్లారిన తర్వాత పొడి కొట్టుకోవాలి.
  4. పొడి గ్రైండర్ లో ఎండిన టమాటో ముక్కలు ,చింతపండు ,గుండుప్పు ,కారం, మెంతిపిండి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి . తయారైన పచ్చడి ని పొడి జాడి లో భద్రపరుచుకోవాలి .
  5. ఎప్పుడు కావాలి అంటే అపుడు ఒక గిన్నిలో తీస్కొని కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు, వెల్లులి రెబ్బలు, కర్వేపాకు ,ఇంగువ,ఎం డుమిరపకాలు వేసి పచ్చడి లో కలుపుకోవాలి.అంతే రుచికరమైన సంవత్సరం మొత్తం నిల్వవుండే టమాటో పచ్చడి సిద్ధం .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర