బెండకాయ చట్నీ | Lady’s finger chutney Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  7th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Lady’s finger chutney recipe in Telugu,బెండకాయ చట్నీ , Kavitha Perumareddy
బెండకాయ చట్నీ by Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

బెండకాయ చట్నీ వంటకం

బెండకాయ చట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Lady’s finger chutney Recipe in Telugu )

  • బెండకాయలు 1/4 కేజీ
  • టమాటాలు 3
  • పచ్చిమిర్చి 6
  • ఉల్లిపాయలు 2
  • జీలకర్ర 1 స్పూన్
  • నూనె 1 స్పూన్
  • చింతపండు కొద్దిగా ఉసిరికాయ అంత
  • పసుపు కొద్దిగా
  • ఉప్పు తగినంత
  • కరివేపాకు కొద్దిగా

బెండకాయ చట్నీ | How to make Lady’s finger chutney Recipe in Telugu

  1. ముందుగా కూరగాయలు అన్ని కడిగి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టి స్పూన్ నూనె వేసుకొని జీలకర్ర వేసి వేగిన తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి కాసేపు మగ్గించాలి.
  3. తరువాత టమాటాలు,బెండకాయ ముక్కలు ,పసుపు,చింతపండు తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు అన్నీ వేసి కలిపి 10 ని.ముషాలు మూత పెట్టుకుని మగ్గించాలి.
  4. తరువాత పప్పుగుత్తితో మెదుపుకోవాలి.అంతే ఇంకా పచ్చడి రెడీ పోపు అవసరం లేదు.

నా చిట్కా:

బెండకాయ తినడం వల్ల బ్రెయిన్ చురుకుగా ఉంటుంది అంటారు.అందుకని నచ్చదు అనకుండా అప్పుడప్పుడు తినాలి.

Reviews for Lady’s finger chutney Recipe in Telugu (0)