కరివేపాకు ఎండుమిర్చి పచ్చడి | Curry leaves dry red chilli chutney Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  7th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Curry leaves dry red chilli chutney recipe in Telugu,కరివేపాకు ఎండుమిర్చి పచ్చడి, Kavitha Perumareddy
కరివేపాకు ఎండుమిర్చి పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

కరివేపాకు ఎండుమిర్చి పచ్చడి వంటకం

కరివేపాకు ఎండుమిర్చి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Curry leaves dry red chilli chutney Recipe in Telugu )

  • కరివేపాకు రెండు కప్స్
  • ఎండుమిర్చి 15
  • జీలకర్ర స్పున్
  • ధనియాలు స్పున్
  • మినప్పప్పు స్పున్
  • మెంతులు పావుస్పూన్
  • వెల్లుల్లి 10 రెబ్బలు
  • ఉప్పు తగినంత
  • నూనె 2 స్పూన్స్
  • చింతపండు కొద్దిగా

కరివేపాకు ఎండుమిర్చి పచ్చడి | How to make Curry leaves dry red chilli chutney Recipe in Telugu

  1. ముందుగా కరివేపాకు కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి.చింతపండు నానబెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర, ధనియాలు,మినపప్పు, మెంతులు,వేసుకొని వేగిన తరువాత ఎండుమిర్చి కూడా వేసి వేగనిచ్చి వేరే ప్లేట్ లో తీసుకోవాలి.
  3. మళ్ళీ అదే బాండీలో స్పున్ నూనె వేసి కరివేపాకు వేసి వేయించుకోవాలి. మరీ మాడి పోయేంతగా వేయించకూడదు,తరువాత ప్లేట్లో తీసుకోవాలి.
  4. ఇప్పుడు రోట్లో ముందుగా ఎండుమిర్చి పోపు,తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత కరివేపాకు, పచ్చి వెల్లుల్లిని వేసి అంతా కలిపి బాగా దంచుకోవాలి.
  5. తరువాత నానబెట్టిన చింతపండు గుజ్జు వేసి దంచుకోవాలి .అంతే ఇంకా పచ్చడి రెడీ .వేరే గిన్నెలో తీసుకోవాలి.పోపు అవసరం లేదు.

నా చిట్కా:

తడి తగలకుండా చూసుకుంటే వారం రోజులు నిలువ ఉంటుంది.

Reviews for Curry leaves dry red chilli chutney Recipe in Telugu (0)