హోమ్ / వంటకాలు / క్యాబేజీ పచ్చడి

Photo of Cabbage chutney  by Chandrika Marripudi at BetterButter
474
0
0.0(0)
0

క్యాబేజీ పచ్చడి

Oct-08-2018
Chandrika Marripudi
25 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాబేజీ పచ్చడి రెసిపీ గురించి

క్యాబేజీ,పచ్చిమిర్చి తో చేసుకునే రోటిపచ్చడి. అన్నం,దోశ,చపాతీలలోకి చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 4

  1. క్యాబేజీ : 1/2 ముక్క
  2. పచ్చిమిర్చి : 20
  3. టొమాటోలు : 3
  4. నూనె : 5 స్పూన్లు
  5. ధనియాలు : 1 స్పూను
  6. ఆవాలు : 1 స్పూను
  7. మినప్పప్పు : 2 స్పూన్లు
  8. పచ్చిశనగపప్పు : 2 స్పూన్లు
  9. జీలకర్ర : 1 స్పూను
  10. చింతపండు : నిమ్మకాయంత
  11. వెల్లుల్లి రెబ్బలు : 10
  12. అల్లం : చిన్నముక్క
  13. కరివేపాకు : 2రెమ్మలు
  14. కొత్తిమీర : కొద్దిగా
  15. ఉప్పు : తగినంత

సూచనలు

  1. ముందుగా క్యాబేజీ సన్నగా తరగాలి. టొమాటోలు కూడా తరగాలి.
  2. ఒక బాండీలో 2 స్పూన్ల నూనె వేసి ధనియాలు వేసి వేగాక తరిగిన క్యాబేజీ,టొమాటో, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
  3. ముక్కలు మగ్గిన తరువాత చింతపండు విడదీసి అందులో వేసి కలపాలి.
  4. చల్లారిన తరువాత అల్లం,వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసి మిక్సిలో వేసి రుబ్బుకోవాలి.
  5. తరువాత స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి వేడయ్యాక పోపుదినుసులు, కరివేపాకు వేసి వేగాక పచ్చడి వేసి కలిపి తరిగిన కొత్తిమీర వేసి కలిపితే క్యాబేజీ పచ్చడి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర