మునకాడ ఆవకాయ | Drumstick pickle Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  8th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Drumstick pickle recipe in Telugu,మునకాడ ఆవకాయ, Sree Vaishnavi
మునకాడ ఆవకాయby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    2

    గంటలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

2

0

మునకాడ ఆవకాయ వంటకం

మునకాడ ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Drumstick pickle Recipe in Telugu )

  • మునకాడలు 8
  • మామిడి తురుము 125 గ్రాములు
  • ఉప్పు తగినంత
  • కారం 100 గ్రాములు
  • మెంతి పొడి 1/2 చెంచా
  • నూనె 2 కప్స్
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • ఇంగువ 1/2 చెంచా

మునకాడ ఆవకాయ | How to make Drumstick pickle Recipe in Telugu

  1. ముందుగా మునకాడలు ని ముక్కలుగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి సరిపడినంత నూనె వేసి అందులో మెంతులు వేసి వేగాక ఈ తరిగిన మునకాడ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి
  3. ఈలోపు మామిడికాయ కి తొక్కు తీసి తురుముకోవాలి దానిని మిక్సీ లో పేస్ట్ చేసుకోవాలి
  4. ఇప్పుడు అందులో ఉప్పు, కారం, మెంతి పిండి వేసి బాగా కలిసేవరకూ కలిపి అందులో వేయించిన ముక్కలు వేసి బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఒక గంటన్నర ఉరనివ్వాలి
  5. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి ఆవాలు ,జీలకర్ర ,ఇంగువ వేసి వేయించి పచ్చడిలో వేసుకోవడమే

Reviews for Drumstick pickle Recipe in Telugu (0)