మామిడికాయ ముక్కల పచ్చడి | Small mango pieces pickle Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  8th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Small mango pieces pickle recipe in Telugu,మామిడికాయ ముక్కల పచ్చడి, Lalitha Kandala
మామిడికాయ ముక్కల పచ్చడిby Lalitha Kandala
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

1

0

మామిడికాయ ముక్కల పచ్చడి వంటకం

మామిడికాయ ముక్కల పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Small mango pieces pickle Recipe in Telugu )

 • 4 లేదా 5 మామిడికాయలు
 • మెంతి పిండి ఒకటిన్నర table స్పూన్
 • ఆవపిండి 2 టేబుల్ స్పూన్స్
 • ఉప్పు 1/4కప్
 • కారం 3/4 కప్
 • నూనె 2 కప్స్

మామిడికాయ ముక్కల పచ్చడి | How to make Small mango pieces pickle Recipe in Telugu

 1. ముందుగా మామిడికాయలు బాగా కడిగి ఆరబెట్టాలి
 2. తరువాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరగాలి
 3. ఒక పాన్ లో ఆవాలు వేసి వేయించాలి
 4. మెంతులు కూడా వేయించి తీసుకోవాలి
 5. ఇవి చల్లారాక మెత్తని పొడి చేసుకోవాలి విడివిడిగా
 6. ఒక పెద్ద గిన్నెలో ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి వేసి బాగా కలిపి మామిడికాయ ముక్కలు కూడా వేసి కలపాలి.
 7. ఇప్పుడు నూనె పోసి బాగా కలిపి మూత పెట్టి 3 రోజులు పోయాక మళ్ళీ కలిపి అన్ని సరిపోయాయో లేదో చూసి ఏమైనా కావాలంటే మళ్ళీ వేసుకోవాలి
 8. ఇప్పుడు పచ్చడిని జాడీలోకి గాని, గాలి చొరబడని box లోకి గాని తీసుకుని కావాల్సినపుడు సర్వ్ చేసుకోవాలి

Reviews for Small mango pieces pickle Recipe in Telugu (0)