సీమ చింతకాయ ఆవకాయ | Madras Thorn / Jungle Jalebi pickle Recipe in Telugu

ద్వారా Swapna Sashikanth Tirumamidi  |  8th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Madras Thorn / Jungle Jalebi pickle recipe in Telugu,సీమ చింతకాయ ఆవకాయ, Swapna Sashikanth Tirumamidi
సీమ చింతకాయ ఆవకాయby Swapna Sashikanth Tirumamidi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

4

0

సీమ చింతకాయ ఆవకాయ వంటకం

సీమ చింతకాయ ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Madras Thorn / Jungle Jalebi pickle Recipe in Telugu )

 • సీమ చింతకాయల గుళ్ళు రెండు కప్పులు
 • కారం అర కప్పు
 • ఆవ పిండి అరకప్పు
 • ఉప్పు అరకప్పుకి కొంచం తక్కువ గా
 • మెంతి పొడి అర చెంచా
 • పసుపు 1/4 చెంచా
 • దాల్చిని చెక్క పొడి అర చెంచా(రుచి కి)
 • నూ పొడి 4 చెంచాలు(వేయించి పొడి కొట్టినది)
 • నిమ్మ ఉప్పు ఒక చెంచా.
 • నువ్వుల నూనె ఒకటిన్నర కప్పులు

సీమ చింతకాయ ఆవకాయ | How to make Madras Thorn / Jungle Jalebi pickle Recipe in Telugu

 1. సీమ చింతకాయలు బాగా లేతవి కాకుండా బాగా ఎర్రగా పండినవి కాకుండా మద్యరకంగా ఉన్నవి తీసుకోవాలి. అంటే గుళ్ళు తెల్లగా ఉండాలి విత్తనం నల్లగా ఉండాలి అన్నమాట ఇవి ఊరగాయకి బావుంటాయి.
 2. ముందుగా కాయలు ఒలిచి ,లోపలి విత్తనాలు తీసేసి 2 కప్పులు ఉండేలా కొలిచి పెట్టుకోవాలి.
 3. పైన చెప్పిన పొడులు అన్ని సిద్ధంగా పెట్టుకోవాలి
 4. ఇప్పుడు ఒక వెడల్పాటి బేసెను తీసుకుని వరుసగా కారం,ఆవపిండి, ఉప్పు, పసుపు,మెంతి పిండి,నూపిండి,దాల్చినచెక్క పొడి,నిమ్మ ఉప్పు అన్ని పొడులు బాగా కలిపి ఉంచాలి.
 5. ఇప్పుడు సీమచింత గుళ్ళని ఒక గిన్నీలోకి తీసుకొని కొద్దిగా నూని పట్టించి పెట్టుకోవాలి.
 6. ఇప్పుడు నూని పట్టించిన వాటిని తీసుకొని, సిద్ధంచేసుకున్న పొడుల మిశ్రమం లో వేసి బాగా కలిపి మిగిలిన నూనె పోసి మళ్ళీ పిండి అంతా కలిసేలా కలుపుకోవాలి.
 7. ఇలా కలిపిన దాన్ని శుభ్రమైన జాడిలోకి తీసుకుని గాలి తగలకుండా మూత పెట్టి 2 రోజులు ఉంచాలి.
 8. 3 వరోజు మళ్ళీ ఒకసారి కలిపుకుంటే ఇక సీమ చింతకాయ ఆవకాయ తినడానికి సిద్ధం అన్నమాట.
 9. వేడి అన్నంలో కలుపుకోవచ్చు. పెరుగు అన్నంలో నంజుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది.

నా చిట్కా:

సీమచింతకాయ గుళ్ళు మరీ తియ్యగావున్నవి ఎంచుకోకూడదు...కొద్దిగా వగరు ఉన్నవి బావుంటాయి.

Reviews for Madras Thorn / Jungle Jalebi pickle Recipe in Telugu (0)