హోమ్ / వంటకాలు / ముల్లంగి పచ్చడి

Photo of White radish chutny by Swapna Sashikanth Tirumamidi at BetterButter
0
4
0(0)
0

ముల్లంగి పచ్చడి

Oct-08-2018
Swapna Sashikanth Tirumamidi
20 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముల్లంగి పచ్చడి రెసిపీ గురించి

ముల్లంగి అంటే చాలామందికి పడదు ఎందుకంటే దాని వాసన అలావుంటుంది మరి అంతెందుకండి మా ఇంట్లోకూడా ముల్లంగి అంటే మొహాలు ముడుచుకు పోతాయి కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకని ఒకరోజు ఏమిటో చెప్పకుండా ఈ పచ్చడి చేసి పెట్టాను మారు కలుపుకొని కూడా తిన్నారు ఇంట్లోవాళ్ళు అంత నచ్చింది.ఇందులో పడే పదార్ధాలన్ని కూడా ఆరోగ్యమైనవే కాబట్టి మంచి పౌష్టికాహారం అని ఖచ్చితంగా చెప్పవచ్చు అన్నం,చపాతీ,పుల్కా ఇలా దేనితో అయినా రుచిగావుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. ముల్లంగి పెద్దది ఒకటి
  2. పుల్ల మామిడి కాయ సగం
  3. పచ్చిమిరప కాయలు 4
  4. వేరుశెనగ గుళ్ళు 3 పెద్ద చెంచాలు
  5. నూ పప్పు 1 చెంచా
  6. ధనియాలు ఒక చెంచా
  7. జీలకర్ర అర చెంచా
  8. మినప్పప్పు ఒక చెంచా
  9. శెనగపప్పు ఒకచెంచా...
  10. మెంతులు పావు చెంచా
  11. ఆవాలు అర చెంచా
  12. ఇంగువ చిటికెడు.
  13. కరివేపాకు 2 రెమ్మలు.
  14. బెల్లం చిన్నముక్క.
  15. ఉప్పు సరిపడా.
  16. పసుపు చిటికెడు.
  17. నూని 4 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ముల్లంగి,మామిడికాయ కడిగి తొక్కతీసి ,చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  2. పొయ్యిమీద మూకుడు పెట్టి వేడి చేసి వేరుశెనగ గుళ్ళు వేయించి,అందులోనే నువ్వులు కూడా వేసి వేయించి పక్కనపెట్టుకోవాలి.
  3. ఇప్పుడు అదే మూకుడులో 2 చెంచాల నూని వేసి వేడిచేసి ముల్లంగి ముక్కలు,పచ్చిమిరపకాయలు, కాస్త ఉప్పు పసుపు వేసి ముల్లంగి వాసన పోయేదాక మగ్గించాలి.
  4. ఇప్పుడు వేరే మూకుడు లో ఒక చెంచా నూనె వేసి ధనియాలు,మెంతులు ,జీలకర్ర,కొంచం మినపప్పు, కొంచెం శెనగపప్పు వేసి బాగా కమ్మగా వేయించి చల్లారపెట్టుకోవాలి.
  5. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నీలో వేయించిన వేరుశెనగ,నువ్వులు,వేయించిన పోపు ,బెల్లం అన్నీ వేసి మెత్తగా పొడి కొట్టుకోవాలి.
  6. అందులోనే వేయించిన ముల్లంగి,పచ్చి మామిడి ముక్కలు ఉప్పు కూడా వేసి 2 సారులు మిక్సీ పట్టాలి మెత్తగా కూడా చేసుకోవచ్చు .కానీ ముక్క పంటికింద పడుతుంటే బావుంటుంది.
  7. ఇపుడు రుబ్బిన పచ్చడిని ఒక బౌల్ లోకి తీసుకుని కొద్దిగా నూని వేడిచేసి ఆవాలు,మినప్పప్పు, శెనగపప్పు,ఎండు మిర్చి, కరివేపాకు,ఇంగువల తో పోపు పెట్టుకోవాలి.
  8. అంతేనండి చక్కటి కమ్మటి రెడీ అండి. అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుంటే బావుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర