హోమ్ / వంటకాలు / కొబ్బరి వాక్కాయ పచ్చడి

Photo of Coconut and Cranberry chutney by Sri Tallapragada Sri Devi at BetterButter
435
1
0.0(0)
0

కొబ్బరి వాక్కాయ పచ్చడి

Oct-09-2018
Sri Tallapragada Sri Devi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి వాక్కాయ పచ్చడి రెసిపీ గురించి

రుచిలో పుల్లగా చూడ్డానికి ఆకుపచ్చగా ఉండే వాక్కాయలు సీజనల్గా వస్తాయి ఇవి పప్పు పచ్చడి కి చాలా బాగుంటాయి విడిగా చేసుకోవచ్చు లేదా కొబ్బరి పెసరపప్పు వంటివాటితో కలిపి కూడా చేసుకోవచ్చు నేను చెప్తున్నా కొబ్బరి వాక్కాయ పచ్చడి అన్నంలోకి ఇడ్లీలలోకి దోశలు పరాటా చపాతీలలో కూడా బావుంటుంది

రెసిపీ ట్యాగ్

  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 4

  1. లేత ముదురు కాని కొబ్బరి చెక్కలు 2
  2. వాక్కాయలు 100 గ్రాములు
  3. పచ్చిమిరప 4
  4. నూనె రెండు టేబుల్ స్పూన్లు
  5. ఎండు మిరప 6
  6. మెంతులు అర స్పూను
  7. ఆవాలు ఒక స్పూను
  8. మినప్పప్పు రెండు స్పూన్లు
  9. ఇంగువ రెండు చిటికెలు
  10. పసుపు చిటికెడు
  11. ఉప్పు తగినంత
  12. ఈ కాయలు పుల్లగా ఉండడాన్ని బట్టి మీ కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకోవాలి

సూచనలు

  1. వాక్కాయలు శుభ్రంగా కడిగి ముక్కలు చేసి వాటిలో ఉండే గింజల్ని తీసేయాలి
  2. కొబ్బరిని కూడా చిప్ప నుంచి వేరు చేసి సన్నగా తరిగి ఉంచుకోవాలి
  3. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె వేసి ఎండుమిర్చి మెంతులు మినప్పప్పు ఆవాలు ఎర్రగా వేగాక ఆఖరిన ఇంగువ పసుపు వేసుకోవాలి
  4. కొబ్బరి ముక్కలు వాక్కాయ ముక్కలు ఎండుమిర్చి పోపు పచ్చిమిర్చి ఉప్పు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  5. కొద్దిగా కరివేపాకు మినప్పప్పు ఆవాలు జీలకర్ర పై పోపు వేసుకుంటే బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర