కాల్చిన వంకాయ పచ్చడి | Charred Eggplant chutney Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  9th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Charred  Eggplant chutney  recipe in Telugu,కాల్చిన వంకాయ పచ్చడి, Kavitha Perumareddy
కాల్చిన వంకాయ పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

కాల్చిన వంకాయ పచ్చడి వంటకం

కాల్చిన వంకాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Charred Eggplant chutney Recipe in Telugu )

  • వంకాయ పెద్దది లేతగా నవనవ లాడుతూ ఉండాలి.
  • టమాటాలు 2
  • పచ్చిమిర్చి 4
  • ఎండుమిర్చి 6
  • జీలకర్ర స్పున్
  • మినప్పప్పు స్పున్
  • చింతపండు కొద్దిగా
  • వెల్లుల్లి 4 రెబ్బలు
  • కరివేపాకు కొద్దిగా
  • కొత్తిమీర కొద్దిగా
  • నూనె 2 స్పూన్స్
  • పోపుగింజలు స్పున్
  • ఉప్పు తగినంత

కాల్చిన వంకాయ పచ్చడి | How to make Charred Eggplant chutney Recipe in Telugu

  1. ముందుగా వంకాయను పుచ్చులు లేకుండా చూసుకోవాలి. తరువాత కడగాలి.వంకాయకు నూనె రాసి అక్కడక్కడ గాట్లు పెట్టాలి .తరువాత కుంపటిమీద, లేకుంటే స్టవ్ మీద పెట్టి అన్నిపక్కల తిప్పుతూ కాల్చుకోవాలి.చల్లారిన తరువాత తోలు తీసేసి గుజ్జు ఒక గిన్నెలో తీసుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి,జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేపుకొని పక్కకు తీసుకోవాలి.మళ్ళీ అదే బాండీలో కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చి, టమాటా ముక్కలు,చింతపండు, తగినంత ఉప్పు వేసి 5 నిముషాలు మగ్గించుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి.
  3. ఇప్పుడు రోటిలో ముందుగా వేయించిన ఎండుమిర్చి, మినపప్పు వేసి దంచుకొని తరువాత టమాటా మిశ్రమం ,వంకాయ గుజ్జు వేసి అంత కలిపి దంచుకోవాలి.
  4. తరువాత పోయిమీద బాండీ పెట్టి, కొద్దిగా నూనె వేసి పోపుగింజలు, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి పోపు వేగనిచ్చి పచ్చడిలో కలపాలి .అంతే ఇక కాల్చిన వంకాయ పచ్చడి సిద్ధం.

నా చిట్కా:

వంకాయకు గాట్లు పెట్టడం వల్ల కాల్చినప్పుడు చిట్లిపోకుండా ఉంటుంది.

Reviews for Charred Eggplant chutney Recipe in Telugu (0)