హోమ్ / వంటకాలు / కాల్చిన వంకాయ పచ్చడి

Photo of Charred  Eggplant chutney  by Kavitha Perumareddy at BetterButter
317
7
0.0(0)
0

కాల్చిన వంకాయ పచ్చడి

Oct-09-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాల్చిన వంకాయ పచ్చడి రెసిపీ గురించి

వంకాయను కుంపటిమీద కాల్చి చేస్తారు .చాలా బాగుంటుంది. అన్నము,చెపాతి,జొన్నరొట్టె లలోకి చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. వంకాయ పెద్దది లేతగా నవనవ లాడుతూ ఉండాలి.
  2. టమాటాలు 2
  3. పచ్చిమిర్చి 4
  4. ఎండుమిర్చి 6
  5. జీలకర్ర స్పున్
  6. మినప్పప్పు స్పున్
  7. చింతపండు కొద్దిగా
  8. వెల్లుల్లి 4 రెబ్బలు
  9. కరివేపాకు కొద్దిగా
  10. కొత్తిమీర కొద్దిగా
  11. నూనె 2 స్పూన్స్
  12. పోపుగింజలు స్పున్
  13. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా వంకాయను పుచ్చులు లేకుండా చూసుకోవాలి. తరువాత కడగాలి.వంకాయకు నూనె రాసి అక్కడక్కడ గాట్లు పెట్టాలి .తరువాత కుంపటిమీద, లేకుంటే స్టవ్ మీద పెట్టి అన్నిపక్కల తిప్పుతూ కాల్చుకోవాలి.చల్లారిన తరువాత తోలు తీసేసి గుజ్జు ఒక గిన్నెలో తీసుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి,జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేపుకొని పక్కకు తీసుకోవాలి.మళ్ళీ అదే బాండీలో కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చి, టమాటా ముక్కలు,చింతపండు, తగినంత ఉప్పు వేసి 5 నిముషాలు మగ్గించుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి.
  3. ఇప్పుడు రోటిలో ముందుగా వేయించిన ఎండుమిర్చి, మినపప్పు వేసి దంచుకొని తరువాత టమాటా మిశ్రమం ,వంకాయ గుజ్జు వేసి అంత కలిపి దంచుకోవాలి.
  4. తరువాత పోయిమీద బాండీ పెట్టి, కొద్దిగా నూనె వేసి పోపుగింజలు, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి పోపు వేగనిచ్చి పచ్చడిలో కలపాలి .అంతే ఇక కాల్చిన వంకాయ పచ్చడి సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర