హోమ్ / వంటకాలు / గోంగూర రోటి పచ్చడి

Photo of GONGURA PICKLE by Sridevi Vedantham at BetterButter
756
3
0.0(0)
0

గోంగూర రోటి పచ్చడి

Oct-09-2018
Sridevi Vedantham
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర రోటి పచ్చడి రెసిపీ గురించి

ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర పచ్చడి - మా అమ్మ చేస్తే ఇంక భోజనం మొత్తం, దీంతో నే లాగించేవాళఁళం. అంత బాగుంటుంది మరి. మా అమ్మ దగ్గర నేర్చుకుని చేశాను. అద్భుతం గా ఉంది రుచి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • వేగన్

కావలసినవి సర్వింగ: 8

  1. ఎర్ర గోంగూర - 4 కట్టలు
  2. ఎండు మిర్చి - 10 లేదా 12
  3. ఆవాలు - 2 టీ స్పూన్లు
  4. మెంతులు - 2 టీ స్పూన్లు
  5. ఉప్పు - రుచి కి సరిపడా
  6. ఇంగువ - 1/2 టీ స్పూను
  7. నూనె - 50 మి. లీ
  8. పసుపు - 1/2 టీ స్పూను

సూచనలు

  1. ముందుగా గోంగూర శుభ్ర పరిచి, కడిగి ఆరబెట్టాలి
  2. పాన్లో 2 స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక ఒక్కొక్కటిగా మెంతులు, ఆవాలు, ఎండు మిర్చి వేసి చిటపటలాడాక ఇంగువ వేసి ఎండు మిర్చి , ఇంకా అన్నీ వేగాక(మెంతులు బాగా ఎర్రగా వేగాలి) కమ్మటి వాసన రాగానే స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లోకి తీసుకొని పసుపు, ఉప్పు కూడా వెయ్యాలి..
  3. పాన్లో కి మిగిలిన నూనె అంతా వేసి వేడి ఐన తర్వాత ఆరబెట్టిన గోంగూర వేసి రంగు మారే వరకు, పిక్ లో ఉన్న విధంగా అయ్యే వరకు వేయించి, ప్లేట్ లో కి తీసుకోవాలి.
  4. పోపు, గోంగూర చల్లారిన తర్వాత ఫస్ట్ పోపు, రోలు ఉంటే రోట్లో లేదా మిక్సీ లో వేసి 3/4th నలిగిన తర్వాత గోంగూర కూడా వేసి 2 సార్లు తిప్పి బౌల్ లోకి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర