పండు మిరపకాయల నిల్వ పచ్చడి | Pandu mirapa kayala nilva pachadi Recipe in Telugu

ద్వారా malleswari dundu  |  9th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Pandu mirapa kayala nilva pachadi recipe in Telugu,పండు మిరపకాయల నిల్వ పచ్చడి, malleswari dundu
పండు మిరపకాయల నిల్వ పచ్చడిby malleswari dundu
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

2

0

పండు మిరపకాయల నిల్వ పచ్చడి వంటకం

పండు మిరపకాయల నిల్వ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pandu mirapa kayala nilva pachadi Recipe in Telugu )

 • పండు మిర్చి 1/2 కేజీ
 • చింత పండు . 150 గ్రామ్లు
 • ఉప్పు 150 గ్రాములు
 • అవ పిండి 50గ్రామ్
 • మెంతి పిండి 50 గ్రామ్
 • నూనె 100 గ్రామ్
 • వెల్లుల్లి 100 గ్రామ్
 • ఎండు మిర్చి 10
 • మిన పప్పు. 2 చెంచాలు
 • ఆవాలు 2 చెంచాలు
 • పచ్చి పప్పు 2 చెంచాలు
 • కరివేపాకు. 2 రెమ్మలు

పండు మిరపకాయల నిల్వ పచ్చడి | How to make Pandu mirapa kayala nilva pachadi Recipe in Telugu

 1. పండు మిర్చిలను తడి గుడ్డ తో తుడిచి పెట్టాలి.
 2. చింతపండు, ఉప్పులతో మిర్చిలను తొక్కులుగా దంచి ఉంచాలి.
 3. ఇలా 4 రోజులు అయిన తరువాత మరళమెత్తగా నురాలి.
 4. అప్పుడు అందులో ఆవ, మెంతి పిండి వేసి రుబ్బాలి.
 5. వెల్లుల్లి కూడా వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.
 6. ఇలా మెత్తగా రుబ్బిన పచ్చడి ని గాజు జాడిలో నిల్వ ఉంచుకోవాలి.
 7. అవసరమైనంత తీసుకొని నూనె లో తాళింపు వేయాలి.
 8. ఒకేసారి మొత్తం పచ్చడిని తాళింపు వేస్తే త్వరగా రంగు మారుతుంది.

నా చిట్కా:

దీనికి గట్టిగా ఉండే మిర్చిలను తీసుకోవాలి.

Reviews for Pandu mirapa kayala nilva pachadi Recipe in Telugu (0)