హోమ్ / వంటకాలు / మామిడిఅల్లం పచ్చడి

Photo of Mango ginger pickle  by మనస్విని శెట్టి at BetterButter
794
4
0.0(0)
0

మామిడిఅల్లం పచ్చడి

Oct-10-2018
మనస్విని శెట్టి
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడిఅల్లం పచ్చడి రెసిపీ గురించి

ఈ వర్షాకాలంలో దొరికే మామిడిఅల్లం పుల్లగా కొంచెం ఘాటుగా బావుంటుంది. దీనితో నిలువ పచ్చడి చేసుకుంటే 6 నెలలు పాటు ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. మామిడిఅల్లం ముక్కలు 1 కప్పు
  2. చింతపండు 3/4 కప్పు
  3. బెల్లం 3/4 కప్పు
  4. ఉప్పు 1/2 కప్పు
  5. ధనియాల పొడి 1/2 కప్పు
  6. మెంతిపొడి 1/2 స్పూన్
  7. కారం 1 కప్పు
  8. ఆవాలు 1 స్పున్
  9. జీలకర్ర 1 స్పున్
  10. ఇంగువ 2 స్పూన్లు
  11. ఎండుమిర్చి 10
  12. నూనె 3/4 కప్పు

సూచనలు

  1. చింతపండు మునిగే వరకు నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు సన్నని మంట పై ఉడికించాలి
  2. ఇలా ఉడికిన చింతపండు పక్కన పెట్టుకోవాలి
  3. స్టవ్ మీద బాండీ పెట్టి 1 స్పున్ నూనె పోసి సన్నని మంట పై మామిడిఅల్లం ముక్కలు వేయించాలి
  4. ఈ మామిడిఅల్లం ముక్కలు లో తడి పోయే వరకు ఒక అరగంట పాటు వేయించాలి
  5. ఇలా వేయించిన మామిడిఅల్లం ముక్కలు చల్లారిన తరువాత మిక్సీలో వేయాలి
  6. అల్లం కొద్దిగా నలిగిన తరువాత ముందుగా ఉడకపెట్టిన చింతపండు నీళ్లతో సహా వేయాలి
  7. ఇది నలుగుతుండగా ధనియాలపొడి, మెంతిపొడి, ఉప్పు , కారం ,బెల్లం తురుము వేయాలి
  8. ఇవన్నీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి
  9. పచ్చడి సిద్ధమై లోపు తిరుగుమాత సిద్ధం చేసుకోవాలి
  10. బాండిలో నూనె పోసి మరిగిన తరువాత
  11. ఎండుమిర్చి, జీలకర్ర,ఆవాలు,ఇంగువ వేయాలి
  12. పచ్చడి మొత్తం సిద్ధమైన తరువాత ఈ తిరుగుమాత వేసి కలిపాలి
  13. మామిడిఅల్లం నిలవ పచ్చడి సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర