గోంగూర ఉల్లిపాయ పచ్చడి | Gongura onion pachadi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  10th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Gongura onion pachadi recipe in Telugu,గోంగూర ఉల్లిపాయ పచ్చడి, Sree Vaishnavi
గోంగూర ఉల్లిపాయ పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

గోంగూర ఉల్లిపాయ పచ్చడి వంటకం

గోంగూర ఉల్లిపాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gongura onion pachadi Recipe in Telugu )

  • గోంగూర - 2 కట్టలు
  • మినపప్పు - 2 చెంచాలు
  • శనగపప్పు - 2 చెంచాలు
  • మెంతులు -కొద్దిగా
  • జిలకర్ర - 1 చెంచా
  • ఆవాలు - 1/2 చెంచా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - 1 చెంచా
  • నూనె - 50 గ్రాములు
  • వెల్లుల్లి - 6 రెబ్బలు
  • ఉల్లిపాయ - 2
  • ఎండుమిర్చి - 6
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఇంగువ - చిటికెడు

గోంగూర ఉల్లిపాయ పచ్చడి | How to make Gongura onion pachadi Recipe in Telugu

  1. గోంగూర ఆకులను విడిపించి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 
  2. బానలిలో మినపప్పు, శనగ పప్పు, ఎండు మిరప, మెంతులు, జిలకర్ర, వెల్లుల్లి పాలయలు వేసి సన్నని మంట మీద దోరగా వేపి పక్కన పెట్టుకోవాలి. 
  3. తరువాత అదే బానలిలో కొద్దిగా నూనె వేసి విడిపించి పెట్టుకొన్న గోంగూర ఆకులను వేసి సన్నని మంటమీద వేపాలి. 
  4. ముందుగా వేపుకొన్న పప్పుదినుసులు, తర్వాత వేపిన గోంగూరకు తగినంత ఉప్పును కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. 
  5. ఇలా తయారైన మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని. 
  6. బానలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వేసి వేగిన తర్వాత గ్రైడ్ చేసి పెట్టుకొన్న పచ్చడిని పోపులో వేసి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చిటికెడు ఇంగువ కలుపుకొని స్టౌవ్ మీద నుండి దింపుకొని వేడి వేడి రైస్ తో ఆరగించండి. 

Reviews for Gongura onion pachadi Recipe in Telugu (0)