కొత్తిమీర నిల్వ పచ్చడి | Coriander pickle Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  10th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Coriander pickle recipe in Telugu,కొత్తిమీర నిల్వ పచ్చడి, Lalitha Kandala
కొత్తిమీర నిల్వ పచ్చడిby Lalitha Kandala
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

కొత్తిమీర నిల్వ పచ్చడి వంటకం

కొత్తిమీర నిల్వ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Coriander pickle Recipe in Telugu )

  • కొత్తిమీర కట్టలు : 4
  • ధనియాలు : 2 టేబుల్ స్పూన్స్
  • ఆవాలు : 1 టేబుల్ స్పూన్
  • మెంతులు : 1/2 టేబుల్ స్పూన్
  • చింతపండు paste : 4 టేబుల్ స్పూన్స్
  • ఎండుమిర్చి : 20
  • వెల్లుల్లి రెబ్బలు : 10
  • పోపు సామాన్లు : ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి కొద్దిగా
  • నూనె : పావు కిలో
  • ఉప్పు రుచికి సరిపడా

కొత్తిమీర నిల్వ పచ్చడి | How to make Coriander pickle Recipe in Telugu

  1. కొత్తిమీర బాగా కడిగి ఆరబెట్టాలి తడిలేకుండా
  2. ఒక పాన్ లో నూనె వేసి ధనియాలు వేయించి తీయాలి
  3. అదే పాన్ లో ఎండు మిర్చి కూడా వేసి బాగా ఎర్రగా వేయించాలి
  4. ఆవాలు, మెంతులు కూడా వేసి వేయించాలి
  5. ఇప్పుడు పాన్ లో నూనె వేసి కొత్తిమీర వేసి బాగా దగ్గరగా అయ్యేవరకు వేయించాలి
  6. మిక్సీలో గాని రోట్లో గాని వేయించిన ధనియాలు, ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు చల్లారాక పొడి చేసుకోవాలి
  7. అందులోనే వేయుంచిన కొత్తిమీర, చింతపండు,ఉప్పు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి
  8. ఇప్పుడు పాన్ లో ఎక్కువ నూనె వేసి పోపు సామాన్లు ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లి వేసి బాగా వేయించి పచ్చడిలో కలపాలి.

నా చిట్కా:

నిల్వ పచ్చడిలో నువ్వులు లేదా వేరుశనగ నూనె వాడితే వాసన బాగుంటుంది.

Reviews for Coriander pickle Recipe in Telugu (0)