కలయ పప్పుల పచ్చడి | Mixed whole grain chutney Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  10th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mixed whole grain chutney recipe in Telugu,కలయ పప్పుల పచ్చడి, Pravallika Srinivas
కలయ పప్పుల పచ్చడిby Pravallika Srinivas
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

కలయ పప్పుల పచ్చడి వంటకం

కలయ పప్పుల పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mixed whole grain chutney Recipe in Telugu )

  • శనగలు - 1 కప్పు
  • పెసలు - 1 కప్పు
  • కందిపప్పు - 1 కప్పు
  • ఉలవలు - 1 కప్పు
  • పొట్టుమినపప్పు - 1 కప్పు
  • చింతపండు - నిమ్మకాయ అంత
  • నూనె - 2 tbsp
  • యండుమిరపకాయలు - 12

కలయ పప్పుల పచ్చడి | How to make Mixed whole grain chutney Recipe in Telugu

  1. ముందుగా చింతపండు ని వేడి నీటిలో నానపెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టి శనగలు వేసి సన్నని మంట పైన దోరగా వేయించుకొని ప్లేట్ లో తీసుకోవాలి. ఇదే విధంగా పెసలు, పొట్టుమినపప్పు, ఉలవలు ,కందిపప్పు అన్ని విడివిడిగా దోరగా వేయించి ప్లేట్ లో తీస్కొని చల్లారనివ్వాలి.
  2. అదే కడాయి లో నూనె వేసి యండుమిరపకాయలు వేయించి చల్లారనివ్వాలి.
  3. ఇప్పుడే మిక్సర్ జార్ లో పప్పులు అన్నినింటిని వేసి యండుమిరపకాయలు, ఉప్పు, నానపెట్టిన చింతపండు వేసి రుబ్బుకోవాలి.చింతపండు నానపెట్టిన నీరు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. కావాలి అనుకున్న వాళ్ళు ఇంగువ పోపు వేసుకోవాలి. అంతే రుచికరమైన కలయ పప్పుల పచ్చడి సిద్ధం.

నా చిట్కా:

యండుమిరపకాయలు గాటుని బట్టి వేసుకోవాలి. తీపి ఇష్టం అయితే బెల్లం వేస్కొవచ్చు.

Reviews for Mixed whole grain chutney Recipe in Telugu (0)