హోమ్ / వంటకాలు / కలయ పప్పుల పచ్చడి

Photo of Mixed whole grain chutney by Pravallika Srinivas at BetterButter
615
4
0.0(0)
0

కలయ పప్పుల పచ్చడి

Oct-10-2018
Pravallika Srinivas
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కలయ పప్పుల పచ్చడి రెసిపీ గురించి

శనగల్లో మెగ్నీషియం థయామిన్ మాంగనీస్ ఫాస్పరస్ వంటివి అధికంగా ఉంటాయి.పెసర్లలో ప్రొటీన్లు కాల్షియం ఫాస్ఫరస్‌ ఇంకా కొన్ని విటమిన్లు కలిగిన మంచి పోషక విలువలున్నాయి.మినుముల్లో ప్రోటీనులు విటమిన్స్ మినిరల్స్ ఫైబర్ స్ట్రార్చ్ అధికంగా ఉంటాయి.ఉల‌వ‌ల్లో ఐర‌న్‌ కాల్షియం పాస్ఫ‌ర‌స్‌ ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటాయి. కందుల్లో మాంసకృత్తులు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.ఇన్ని పోషకాలు ఉన్న పప్పులు అన్నినింటిని కలిపి చేసే ఒక రుచికరమైన & బలమైన పచ్చడి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 10

  1. శనగలు - 1 కప్పు
  2. పెసలు - 1 కప్పు
  3. కందిపప్పు - 1 కప్పు
  4. ఉలవలు - 1 కప్పు
  5. పొట్టుమినపప్పు - 1 కప్పు
  6. చింతపండు - నిమ్మకాయ అంత
  7. నూనె - 2 tbsp
  8. యండుమిరపకాయలు - 12

సూచనలు

  1. ముందుగా చింతపండు ని వేడి నీటిలో నానపెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టి శనగలు వేసి సన్నని మంట పైన దోరగా వేయించుకొని ప్లేట్ లో తీసుకోవాలి. ఇదే విధంగా పెసలు, పొట్టుమినపప్పు, ఉలవలు ,కందిపప్పు అన్ని విడివిడిగా దోరగా వేయించి ప్లేట్ లో తీస్కొని చల్లారనివ్వాలి.
  2. అదే కడాయి లో నూనె వేసి యండుమిరపకాయలు వేయించి చల్లారనివ్వాలి.
  3. ఇప్పుడే మిక్సర్ జార్ లో పప్పులు అన్నినింటిని వేసి యండుమిరపకాయలు, ఉప్పు, నానపెట్టిన చింతపండు వేసి రుబ్బుకోవాలి.చింతపండు నానపెట్టిన నీరు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. కావాలి అనుకున్న వాళ్ళు ఇంగువ పోపు వేసుకోవాలి. అంతే రుచికరమైన కలయ పప్పుల పచ్చడి సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర