దోసవిత్తనాలు చింతతొక్కు పచ్చడి | Cucumber seeds tamarind chutney Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  10th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Cucumber seeds tamarind chutney  recipe in Telugu,దోసవిత్తనాలు చింతతొక్కు పచ్చడి, Kavitha Perumareddy
దోసవిత్తనాలు చింతతొక్కు పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

దోసవిత్తనాలు చింతతొక్కు పచ్చడి వంటకం

దోసవిత్తనాలు చింతతొక్కు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cucumber seeds tamarind chutney Recipe in Telugu )

  • దోసకాయ విత్తనాలు చిన్న కప్
  • చింతతొక్కు చిన్న కప్
  • ఎండుమిర్చి 15
  • జీలకర్ర స్పున్
  • ధనియాలు స్పున్
  • నూనె 3 స్పున్
  • వెల్లుల్లి రెబ్బలు 6
  • పోపుగింజలు స్పున్
  • కరివేపాకు కొద్దిగా
  • ఉప్పు అవసరం ఉండదు చింతతొక్కు లో ఉంటుంది.

దోసవిత్తనాలు చింతతొక్కు పచ్చడి | How to make Cucumber seeds tamarind chutney Recipe in Telugu

  1. ముందుగా పోయిమీద బాండీ పెట్టి నూనె లేకుండా దోసవిత్తనాలు వేయించి పక్కకు తీసుకోవాలి.తరువాత బాండీలో స్పున్ నూనె వేసి జీలకర్ర ,ధనియాలు, ఎండుమిర్చి వేసి వేపుకోవాలి.
  2. రోటిలో ముందుగా దోసవిత్తనాలు వేసి మెత్తగా దంచుకోవాలి.
  3. తరువాత ఎండుమిర్చి వేసి దంచుకోవాలి.
  4. బాగా మెత్తగా దంచుకోవాలి.
  5. తరువాత చింతతొక్కు వేసి అంతా కలిసేలా దంచుకోవాలి.
  6. గట్టిగా ఉండకుండా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ నూరుకోవాలి.
  7. తరువాత పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి పోపుగింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు తో పోపు పెట్టి పచ్చడిలో కలపాలి.అంతే ఇంకా పచ్చడి రెడీ ... :relaxed:

నా చిట్కా:

ఇలా విత్తనాలు వాడడం వల్ల మనకు కావలిసిన మంచి కొలెస్ట్రాల్ అందుతుంది.

Reviews for Cucumber seeds tamarind chutney Recipe in Telugu (0)