అవిసె నువ్వుల పొద్దుతిరుగుడు గింజెల పచ్చడి | Flax seseme sunflower seeds Chutney Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  10th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Flax seseme sunflower seeds Chutney recipe in Telugu,అవిసె నువ్వుల పొద్దుతిరుగుడు గింజెల పచ్చడి, Pravallika Srinivas
అవిసె నువ్వుల పొద్దుతిరుగుడు గింజెల పచ్చడిby Pravallika Srinivas
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

అవిసె నువ్వుల పొద్దుతిరుగుడు గింజెల పచ్చడి వంటకం

అవిసె నువ్వుల పొద్దుతిరుగుడు గింజెల పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Flax seseme sunflower seeds Chutney Recipe in Telugu )

  • అవిసెగింజలు - 1 కప్పు
  • నువ్వులు - 1 కప్పు
  • ప్రొద్దుతిరుగుడు గింజలు - 1 కప్పు
  • యండుమిరపకాయలు - 10
  • చింతపండు - నిమ్మకాయ అంత
  • ఉప్పు - 1 spn
  • బెల్లం - 2 tbsp
  • నీరు - తగినంత
  • నూనె - తగినంత

అవిసె నువ్వుల పొద్దుతిరుగుడు గింజెల పచ్చడి | How to make Flax seseme sunflower seeds Chutney Recipe in Telugu

  1. ముందుగా చింతపండు ని వేడి నీటిలో నానపెట్టుకోవాలి.స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి కాగాక అవిసెగింజలు వేసి చిటపటలాడాక ఒక ప్లేట్ లో వేసుకోవాలి. అదే నూనె లో నువ్వులు కూడా వేయించుకోవాలి. ప్రొద్దుతిరుగుడు గింజలు కూడా అదే విధంగా వేయించి ప్లేట్ లో వేసి చల్లారనివ్వాలి. కొంచం నూనె వేసి యండుమిరపకాయలు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  2. పదార్దాలు అన్ని చల్లారిన తర్వాత మిక్సర్ జార్ లో వేయించిన అవిసెగింజలు , నువ్వులు, ప్రొద్దుతిరుగుడు గింజలు ,వేయించిన యండుమిరపకాయలు, నానపెట్టిన చింతపండు, ఉప్పు, బెల్లం వేసి తగినంత నీరు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే ఎన్నో ప్రయోజనాలు ఉన్న రుచికరమైన అవిసె నువ్వుల పొద్దుతిరుగుడు గింజెల పచ్చడి సిద్ధం.

నా చిట్కా:

ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ పోపు వేస్కొవచ్చు.

Reviews for Flax seseme sunflower seeds Chutney Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo