హోమ్ / వంటకాలు / అవిసె నువ్వుల పొద్దుతిరుగుడు గింజెల పచ్చడి

Photo of Flax seseme sunflower seeds Chutney by Pravallika Srinivas at BetterButter
1480
4
0.0(0)
0

అవిసె నువ్వుల పొద్దుతిరుగుడు గింజెల పచ్చడి

Oct-10-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అవిసె నువ్వుల పొద్దుతిరుగుడు గింజెల పచ్చడి రెసిపీ గురించి

ప్రస్తుత కాలుష్య వాతావరణం & ఆహారపు అలవాట్ల వలన సమస్యలు ఎదుర్కొంటున్నాం. అందులో స్త్రీలకు ప్రధాన సమస్య ఋతుక్రమణం సరియైన సమయానికి రాకపోవడం. అవిసెగింజలు రోజు తీసుకోవడం వలన ఈ సమస్య తక్కుముఖం పడుతుంది.ఋతుక్రమణం సమస్య ఎదుర్కోవడం లో మరొక పదార్థమైన నువ్వులు బెల్లం కూడా ఈ పచ్చడి లో వేస్కుంటున్నాం.ప్రొద్దుతిరుగుడు గింజలు తీసుకోవడం వలన గుండెకు సరఫరా అయ్యే రక్తనానాలు చురుగ్గా పని చేసి గుండె సమస్యలు రాకుండా చేస్తుంది. ఈ మూడు కలగలిపిన తయారైన పచ్చడి రుచి కూడా అమోఘం.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. అవిసెగింజలు - 1 కప్పు
  2. నువ్వులు - 1 కప్పు
  3. ప్రొద్దుతిరుగుడు గింజలు - 1 కప్పు
  4. యండుమిరపకాయలు - 10
  5. చింతపండు - నిమ్మకాయ అంత
  6. ఉప్పు - 1 spn
  7. బెల్లం - 2 tbsp
  8. నీరు - తగినంత
  9. నూనె - తగినంత

సూచనలు

  1. ముందుగా చింతపండు ని వేడి నీటిలో నానపెట్టుకోవాలి.స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి కాగాక అవిసెగింజలు వేసి చిటపటలాడాక ఒక ప్లేట్ లో వేసుకోవాలి. అదే నూనె లో నువ్వులు కూడా వేయించుకోవాలి. ప్రొద్దుతిరుగుడు గింజలు కూడా అదే విధంగా వేయించి ప్లేట్ లో వేసి చల్లారనివ్వాలి. కొంచం నూనె వేసి యండుమిరపకాయలు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  2. పదార్దాలు అన్ని చల్లారిన తర్వాత మిక్సర్ జార్ లో వేయించిన అవిసెగింజలు , నువ్వులు, ప్రొద్దుతిరుగుడు గింజలు ,వేయించిన యండుమిరపకాయలు, నానపెట్టిన చింతపండు, ఉప్పు, బెల్లం వేసి తగినంత నీరు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే ఎన్నో ప్రయోజనాలు ఉన్న రుచికరమైన అవిసె నువ్వుల పొద్దుతిరుగుడు గింజెల పచ్చడి సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర