కాశ్మీరీ అక్రూట్ చట్నీ. | Walnut chutney kashmeer style. Recipe in Telugu

ద్వారా Swapna Sashikanth Tirumamidi  |  10th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Walnut chutney kashmeer style. recipe in Telugu,కాశ్మీరీ అక్రూట్ చట్నీ., Swapna Sashikanth Tirumamidi
కాశ్మీరీ అక్రూట్ చట్నీ.by Swapna Sashikanth Tirumamidi
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

1

0

కాశ్మీరీ అక్రూట్ చట్నీ. వంటకం

కాశ్మీరీ అక్రూట్ చట్నీ. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Walnut chutney kashmeer style. Recipe in Telugu )

 • అక్రూట్స్/వాల్నట్స్ ఒక కప్పు
 • పెరుగు మీద గట్టి మీగడ 3 పెద్ద చెంచాలు
 • కొత్తిమీర ఒక కప్పు
 • పుదీనా గుప్పెడు
 • ఉల్లిపాయ ఒకటి
 • వెల్లుల్లి 3 రెబ్బలు
 • పచ్చిమిర్చి 2....3
 • ఉప్పు సరిపడా

కాశ్మీరీ అక్రూట్ చట్నీ. | How to make Walnut chutney kashmeer style. Recipe in Telugu

 1. ముందు (వాల్నట్స్) ఆక్రోటు కడిగి 5 నిమిషాలు నాన పెట్టుకోవాలి
 2. ఇప్పుడు వాల్నట్స్ ,ఉల్లిపాయ,వెల్లుల్లి,పచ్చిమిర్చి,పుదీనా,కొత్తిమీర,ఉప్పు అన్నీ మిక్సిజార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి
 3. చివరగా మీగడ వేసి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టి.. గిన్నీలోకి తీసుకుంటే వాల్నట్స్ పచ్చడి రెడీ...బావుందికాదూ ...పొయ్యి అవసరం లేకుండా సులభంగా అయిపోయింది కదా
 4. ఇడ్లీ,దోసెలు,రోటీ...ఇలా వెతిలోకైనా బావుంటుంది.చాలా సులభం కూడా.రాతి రోలు ఉన్నవారు తప్పక అందులోనే చేసుకోండి..కాకపోతే ఒకదాని తరువాత ఒకటి దంచుకుంటూ ఉండాలి.

నా చిట్కా:

గట్టిమీగడ లేకపోతే తాజా క్రీమ్ కూడా వేసుకోవచ్చు...కవాలనుకున్నవారు నిమ్మరసం పిండుకోవచ్చు.

Reviews for Walnut chutney kashmeer style. Recipe in Telugu (0)