హోమ్ / వంటకాలు / దోసకాయ పచ్చిముక్కల పచ్చడి.

Photo of Yello cucumber chutney by Kavitha Perumareddy at BetterButter
396
0
0.0(0)
0

దోసకాయ పచ్చిముక్కల పచ్చడి.

Oct-10-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోసకాయ పచ్చిముక్కల పచ్చడి. రెసిపీ గురించి

పచ్చి దోసకాయ ముక్కలతో చేస్తారు చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. దోసకాయ 1 గట్టిగా ఉండాలి.
  2. పచ్చిమిర్చి 10
  3. వేరుశనగ పప్పులు 2 స్పూన్స్
  4. జీలకర్ర స్పున్
  5. ఎండుమిర్చి 5
  6. వెల్లుల్లి 5 రెబ్బలు
  7. పోపుగింజలు స్పున్
  8. నూనె 2 స్పూన్స్
  9. కరివేపాకు కొద్దిగా
  10. కొత్తిమీర గుప్పెడు
  11. చింతపండు కొద్దిగా
  12. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా దోసకాయ ముక్కలు గా తరిగి పెట్టుకోవాలి.విత్తనాలు గుజ్జు పడేయకూడదు .
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి కొద్దిగా నూనె వేసి జీలకర్ర, వేరుశనగ విత్తనాలు ,ఎండుమిర్చి వేసి వేపుకొని పక్కకు తీసుకోవాలి.
  3. తరువాత బాండీలో ఇంకా కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చి ,చింతపండు, వెల్లుల్లి వేసి కొద్దిగసేపు వేయించుకోవాలి.మరీ ఎక్కువ వేయించకూడదు.
  4. ఇప్పుడు రోటిలో ముందుగా ఎండుమిర్చి, తగినంత ఉప్పువేసి దంచుకోవాలి.
  5. తరువాత పచ్చిమిర్చి,కొత్తిమీర వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత దోసకాయ ముక్కలు వేసి చిన్నగా దంచుకోవాలి .ముక్కలు నలగకూడదు.
  6. తరువాత గింజలు గుజ్జు వేసి అంతా కలిసేలా ఊరికే అలా అలా కలిపినట్టు దంచుకోవాలి.
  7. తరువాత పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి పోపుగింజలు, ఎండుమిర్చి, కరివేపాకు తో పోపు పెట్టి పచ్చడిలో కలపాలి. ఇంగువ ఇష్టమైతే పోపులో కొద్దిగా వేసుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర