హోమ్ / వంటకాలు / అరబిక్ ముతాబల్

Photo of Arabic Mutabal by Swapna Tirumamidi at BetterButter
100
5
0.0(0)
0

అరబిక్ ముతాబల్

Oct-10-2018
Swapna Tirumamidi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరబిక్ ముతాబల్ రెసిపీ గురించి

ఈ ముతాబల్ అరబ్బులు ప్రత్యేక వంటకం చాలా రుచిగావుంటుంది.మన వంకాయపెరుగు పచ్చడి పద్ధతిలో చేస్తారు కాకపోతే కొన్ని పదార్ధాలు మారతాయి అందుకే రుచికూడా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నేను దీనికి ఆంధ్ర రుచి జోడించాను... అరబ్ వాళ్ళు దీన్ని కబూస్ అనే రోటీలతో తింటారు.ఆమోఘంగా ఉంటుంది ఈ జోడి.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • మిడిల్ ఈస్టర్న్
  • గ్రిల్లింగ్
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. ఎగ్ప్లాంట్/నల్ల పెద్ద వంకాయ ఒకటి(గింజలు లేనిది ఐతే చాలా మంచిది)
  2. వెల్లుల్లి దంచినది 1 చెంచా
  3. గట్టి ,కమ్మటి పెరుగు అరకప్పు
  4. ఆలివ్ ఆయిల్ 4 చెంచాలు
  5. ఉప్పు సరిపడగా..
  6. పార్స్లీ ఆకుల తరుగు 2 చెంచాలు.
  7. నిమ్మరసం 2 చెంచాలు.
  8. తహీన(నూపిండి ముద్ద)అరకప్పు
  9. తహీన కొరకు....తెల్లనువ్వులు ఒకకప్పు
  10. ఆలివ్ ఆయిల్ అరకప్పు
  11. ఉప్పు సరిపడా..
  12. పోపు కి...శెనగపప్పు పావు చెంచా
  13. మినప్పప్పు పావు చెంచా
  14. ఆవాలు అర పావు చెంచా
  15. కరివేపాకు 6 ఆకులు.

సూచనలు

  1. ముందుగా తహీన తయారీ చూద్దాం. మంటమీద మూకుడు పెట్టి నువ్వులు వేసి మడిపోకుండా కమ్మగా వేయించి పక్కన చల్లార పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు వేయించిన నూపప్పుని మిక్సీలో మెత్తగా పొడి చేసి,అందులో అరకప్పు ఆలివ్ ఆయిల్ వేసి మెత్తటి పేస్ట్ లా ఆడుకొని చివరగా 2 చిటికెల ఉప్పువేసి మళ్ళీ ఒకసారి మిక్సీపట్టి గాజు సీసా లో భద్రపరచుకోవాలి. నెలరోజులు నిలవ ఉంటుంది ఈ తహీన.
  3. ఇప్పుడు పుచ్చులు లేని ఒక పెద్ద వంకాయని తీసుకుని పొయ్యిమీద అన్ని వైపులా బాగా కాల్చి తొక్కతీసేసి లోపలి గుజ్జుని ఒకప్లేట్ లోకి తీసుకుని జాగర్తగా చెక్ చేసుకుని ,ఒక బౌల్ లోకి తీసుకోవాలి.
  4. ఇప్పుడు అందులో దంచిన వెల్లుల్లి వేసి బాగా మెత్తగా ముద్దలా అయ్యేలా మెదపాలి.
  5. ఇప్పుడు అందులో తహీన అరకప్పు,పెరుగు,ఉప్పు వేసి బాగా మెదిపి...పార్స్లీ ఆకుల తరుగు,నిమ్మరసం వేసికలపి ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి.
  6. చివరగా పోపు వేయించి వేసుకోవాలి.(ఇది నిజానికి అవసరం లేదు)పక్కన ఉల్లిపాయముక్కలు నన్చుకుంటే బావుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర