ఆవకాయ పచ్చడి | Mango mustard pickle Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  10th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mango mustard pickle recipe in Telugu,ఆవకాయ పచ్చడి, Kavitha Perumareddy
ఆవకాయ పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    0

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

1

0

ఆవకాయ పచ్చడి వంటకం

ఆవకాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango mustard pickle Recipe in Telugu )

  • పుల్లగా వుండే మామిడికాయముక్కలు 4 గిన్నెలు
  • కారం ఒక గిన్నె
  • ఉప్పు ముప్పావు గిన్నె
  • ఆవపిండి ముప్పావు గిన్నె
  • మెంతిపిండి 2 స్పూన్స్
  • పసుపు 2 స్పూన్స్
  • వెల్లుల్లి రెబ్బలు ఒక కప్
  • నువ్వుల నూనె లేదా పల్లీలు నూనె కేజీ

ఆవకాయ పచ్చడి | How to make Mango mustard pickle Recipe in Telugu

  1. ముందుగా మామిడి కాయలు కడిగి టవల్ తో తుడిచి తడిలేకుండా ఆరబెట్టుకోవాలి.
  2. తరువాత ముక్కలు చేసుకోవాలి.
  3. ఇక్కడ నేను పది కాయలు తీసుకున్నాను . అన్ని పచ్చివే వేసాను ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లి, నూనె వేటిని వేడి చేయలేదు.అన్ని పచ్చిగా వాడాను .
  4. ముక్కలు ఒక గిన్నెతో కొలుచుకోవాలి.నాలుగు గిన్నెలు ముక్కలు ఐతే అదే గిన్నెతో కారం ఒక గిన్నె,ఉప్పు ముప్పావు గిన్నె ,ఆవపిండి ముప్పావు గిన్నె,నూనె ఒక గిన్నె తీసుకోవాలి .ఇలా కొలతలు చూసుకోవలి. నూనె తక్కువ ఐతే వేసుకోవచ్చు.
  5. ఇప్పుడు పెద్ద బేసిన్ లో మామిడి ముక్కలు వేసి 2 స్పూన్ నూనె వేసి 2 స్పూన్ పసుపు వేసి బాగా కలిపి అరగంట సేపు ఉండాలి.
  6. తరువాత ఉప్పు,కారం, ఆవపిండి, మెంతిపిండి వేసి అంతా ముక్కలకు కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత నూనె ,వెల్లుల్లి వేసి బాగా కలిపి మూత పెట్టి 2 డేస్ ఉండాలి.
  7. రెండురోజుల తరువాత పచ్చడి మళ్ళీ అంతా బాగా కలిపి శుభ్రమైన జాడీలో తీసుకోవాలి. తడి ఎక్కడా తగలకూడదు. మిక్సీలో ఆవపిండి వేసేటప్పుడు తడి లేకుండా ఉండాలి.
  8. మంచి సువాసనతో మామిడికాయ ఆవకాయ సిద్ధం .తడి తగలకుండా కొంచెం కొంచెం వేరే గిన్నెలో తీసుకుంటూ వాడుకుంటే సంవత్సరం వరకు చెడిపోదు. ఉప్పుకారం అన్నీ చూసుకోవాలి.ఉప్పు అస్సలు తక్కువ కాకూడదు.

నా చిట్కా:

జాడీలో పచ్చడి పెట్టినప్పుడు శుభ్రమైన బట్టతో మూతి కట్టు కట్టి అప్పుడు మూత పెట్టుకోవాలి.దుమ్ము చేరకుండా ఉంటుంది.

Reviews for Mango mustard pickle Recipe in Telugu (0)