వాల్నట్ పచ్చడి | Walnuts chutney Recipe in Telugu

ద్వారా Swapna Sashikanth Tirumamidi  |  10th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Walnuts chutney by Swapna Sashikanth Tirumamidi at BetterButter
వాల్నట్ పచ్చడిby Swapna Sashikanth Tirumamidi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

1

0

వాల్నట్ పచ్చడి వంటకం

వాల్నట్ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Walnuts chutney Recipe in Telugu )

 • నూని 4 చెంచాలు
 • ఉప్పు సరిపడగా.
 • ఎండుమిర్చి 2
 • ఇంగువ చిటికెడు
 • ఆవాలు అర చెంచా
 • ధనియాలు అర చెంచా
 • జీలకర్ర అర చెంచా
 • కరివేపాకు 2 రెమ్మలు
 • ఉల్లిపాయ ఒకటి
 • చింతపండు గుజ్జు అర చెంచా
 • వెల్లుల్లి 3 రెబ్బలు
 • అల్లం ముక్క చిన్నది
 • పచ్చిమిర్చి 4
 • పచ్చి కొబ్బరి అరకప్పు
 • పుదీనా అరకప్పు
 • కొత్తిమీర అర కప్పు
 • వాల్నట్స్ ఒక కప్పు

వాల్నట్ పచ్చడి | How to make Walnuts chutney Recipe in Telugu

 1. ముందుగా వాల్నట్స్ 5 నిమిషాలు వేయించి చల్లారపెట్టాలి.(నూని లేకుండావేయించాలి).
 2. అదే మూకుడులో కొద్దిగా నూని వేడి చేసి ధనియాలు,జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు చేసి వేసి వేయించాలి.
 3. అందులోనే...అల్లం,వెల్లుల్లి,పచ్చిమిరప, పుదీనా,కొత్తిమీర,చింతపండు వేసి 3 నిమిషాలు వేయించాలి.
 4. ఇప్పుడు వాటిని మిక్సీలోగిన్నీలోవేసి వేయించిన వాల్నట్స్,కొబ్బరి,ఉప్పు కూడవేసి మెత్తగా రుబ్బుకోవాలి.
 5. చివరగా కరివేపాకు,ఇంగువ,ఆవాలు,పప్పులు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకుంటే రుచికరమైన వాల్నట్స్ పచ్చడి రెడీ.

నా చిట్కా:

చింతపండు బదులు నిమ్మరసం వేసుకోవచ్చు.

Reviews for Walnuts chutney Recipe in Telugu (0)